ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
చోటి మసీదు ప్రక్కన పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లిం డ్రైవర్లకు ఇత్తిహద్-ఉల్-ముసల్మాన్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పంపిణీ చేశారు. తదనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పవిత్ర రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకుందామని తెలుపుతూ ఆపదలో ఉన్న సాటి డ్రైవర్ కడుపు నింపాలని దృఢ సంకల్పంతో ఇత్తిహద్-ఉల్-ముసల్మాన్ డ్రైవర్ అసోసియేషన్ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందిస్తూ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలుపూతూ 50 మంది నిరుపేద డ్రైవర్లకు 5000 రూపాయలు విలువ గల నిత్యవసర వస్తువులు అందించినందుకు వారిని అభినందింస్తూ ఎల్లప్పుడూ కలిసి కట్టుగా ఉండాలి ఆకాంక్షించారు.
కార్యక్రమంలో 59వ డివిజన్ ప్రెసిడెంట్ సుహస్, రఫీక్ ,ఆన్సర్, జాఫ్ఫార్,హూస్సెన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: