మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను, రాహుల్ గాంధీ సందేశాన్ని గడపగడపకు చేరవేసే ఉద్దేశంతో తలపెట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా జనగామ కాంగ్రెస్ పార్టీ 9వ డివిజన్ అధ్యక్షుడు శివ ఆధ్వర్యంలో స్థానిక 9 వ డివిజన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని గడపగడపకు తిరుగుతూ ప్రజల కష్ట, సుఖాలను తెలుసుకుంటూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ యాత్ర కొనసాగింది.
ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ప్రజలందరూ ఈ పాలనలో విసుగు చెందుతున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్టం కడితే, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుందని, పేద, సామాన్య ప్రజలందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో 5 లక్షల రూపాయలతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా 5లక్షల రూపాయలను వైద్య ఖర్చులకు అందిస్తామని అన్నారు..
అదేవిధంగా
స్థానిక ఎమ్మెల్యే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా ప్రజలను నిలువునా మోసం చేశారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని స్థానిక ఎమ్మెల్యేకి ఓట్లు అడిగే హక్కు లేదని, దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ, ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై లేదని విమర్శించారు. పేదలకు, రైతులకు కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో, యాత్ర చెర్మాన్ కార్పొరేటర్ ముస్తఫా,నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ ,మహంక్వాలి స్వామి ,శ్రీనివాస్ యాదవ్, యుగంధర్, షోషల్ మీడియా ఇంచార్జి దులికట సతీష్, ఇదునూరి హరిప్రసాద్, చుక్కల శ్రీనివాస్ ,నంది వెంకటేష్ ,కిరణ్, శంకర్ , అనుమా సత్తి, తిరుపతి రెడ్డి,,హరీష్, జనగామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Post A Comment: