మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడంపై INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా లో అర్థ నగ్నంగా నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన INTUC నాయకులు .*ఈ సందర్భంగా INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ మాట్లాడుతురాహూల్ గాంధీ పై లోక్ సభ తీసుకున్న చర్య అప్రజాస్వామికమని, భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే కాకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం, లౌకికవాద రక్షణ కోసం రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా చేసిన భారత్ జోఢో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్ ను అమాంతం పెంచిందని అలాగే రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే ఫాసిస్టు, ఫ్యూడల్ లక్షణాలతో మోడీ సర్కార్ భయం తో రాహుల్ గాంధీ పై ఇలా చర్యలు తీసుకుందని .
ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచించి రాహుల్ గాంధీ పై వేసినఅనర్హత వేటు ను వెనక్కి తీసుకోవాలని, దీనికోసం భారత దేశం లోని ప్రజాస్వామ్య పార్టీలు అన్ని ఏకం అయ్యి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు .
ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి కుమారస్వామి , సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి , సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంఛార్జి వికాస్ , INTUC జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాస్ ,RG-1 ఉపాధ్యక్షులు సదానందం , సెంట్రల్ నాయకులు తైసన్ శ్రీనివాస్ , ఈ కృష్ణ ,పోచయ్య , బ్రాంచ్ సెక్రెటరీలు జగన్ మోహన్ , శ్రీనివాస్ , బార్ల మనోహర్ , పిట్ కార్యదర్శిలు. J మహేష్ , గణపతి దామోదర్ , అల్లావుద్దీన్ , జనగామ రాజేశం , కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
Post A Comment: