మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రాహుల్ గాంధీ పై పార్లమెంట్లో నిన్న అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ప్రధాన చౌరస్తాలో గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. దాదాపు గంటసేపు కొనసాగిన ఈ దీక్ష అనంతరం వారు మాట్లాడుతూ
భారత దేశ ప్రజాస్వామ్యానికి
పార్లమెంటరీ వ్యవస్థకు ఇది చీకటి రోజని వారన్నారు ఇటీవల భారత్ జోడోయాత్రతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి జనంలో మమేకమైన రాహుల్ గాంధీ కి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక భయంతో ఎనిమిది సంవత్సరాల అధికారమదం తలకిక్కడంతో మోడీ ఒక నియంతల వ్యవహరిస్తూ ప్రతిపక్షమే లేకుండా ప్రశ్నించే గొంతుకలను సంస్కృతితో ముందుకు వెళుతున్న మోడీ ఆటలిక సాగవని అన్నారు.
స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న గాంధీ కుటుంబాన్ని పై బురద చల్లడమే ప్రధాన ఎజెండాగా, దేశంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని కలలు కంటున్న
నరేంద్ర మోడీ ఖబర్దార్..
నువ్వు ఇలాంటి నీచపు రాజకీయాలు ఎన్ని చేసినా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని గాని, గాంధీ కుటుంబాన్ని గాని ఏం పీకలేవని, ఇవన్నీ దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని మండిపడ్డారు.
నీలాంటి ఎంతోమంది నియంతలు ఈ కాలగర్భంలో కలిసిపోయారని సంగతి గుర్తుంచుకోవాలని, రాబోయే రోజుల్లో ఇవన్నీంటికి మూల్యం చెల్లించక తప్పదని వారు హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ బీసీ సెల్ అధ్యక్షులు గట్ల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవికుమార్, కార్పొరేటర్ ఎండి ముస్తఫా, పెద్దెల్లి ప్రకాష్,
తాళ్లపల్లి యుగంధర్, వీరబోయిన రవి యాదవ్, సుతారి లక్ష్మణ్ బాబు, బొమ్మక రాజేష్, గడ్డం శేఖర్, ఎండి యాకూబ్, ఆడెపు దశరథం సొల్లు రామస్వామి, ఈదునూరి హరిప్రసాద్, ధూళికట్ట సతీష్, మాటూరి సత్యప్రసాద్, తిరుపతి రెడ్డి, మారుతి, కెంగర్ల కుమార్, అప్పాసి శ్రీనివాస్, విజయ్ బైరిమల దుర్గ, రవికుమార్, ఎండీ.రహీమ్, ఆరిఫ్, కధీర్, నంది వెంకటేష్, కార్తీక్, అరుణ్, అడప కృష్ణ, శ్రీకాంత్, జడల శ్రీనివాస్,
విజయ్ గౌడ్, వెంకటేష్ లతోపాటు దాదాపుగా వందమంది కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: