భూపాలపల్లి, జూన్ 21: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న నిర్వహించనున్న ‘రాజ్యాధికార సమరభేరి’ సభ పోస్టర్‌ను జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌లో శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సామాజిక, రాజకీయ అభ్యున్నతే రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆ దిశగా పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు.ప్రతి పేద కుటుంబానికి కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య, వైద్యం అందాలని, బహుజన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే ప్రజలు పెద్ద ఎత్తున జూలై 5న జరిగే రాజ్యాధికార సమరభేరి సభకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రం అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిందని, ప్రస్తుతం కొందరి చేతుల్లో నలిగిపోతోందని విమర్శించారు. రెడ్డి, వెలమ ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలికి, బహుజన వర్గాలకు రాజ్యాధికారం సాధించాల్సిన సమయం ఆసన్నమైందని రవి పటేల్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మోటపోతుల సమ్మయ్య, మడే సంతోష్, జినుకల శ్రీను, అశోక్, కృష్ణ ప్రశాంత్, శ్రీపతి, భద్రయ్య, రంజిత్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: