కాటారం, జూన్ 17 : కాటారం మండలంలో 2008-డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారిణి (ఎంఈవో)పై కొన్ని పత్రికల్లో ప్రచురితమైన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ, ఎంఈవో శ్రీదేవి గానీ, ఎంఆర్సీ సిబ్బంది గానీ తమ బిల్లుల మంజూరు విషయంలో ఎప్పుడూ ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో ఎంఈవో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. తమ బిల్లుల చెల్లింపుల విషయంలో డబ్బులు అడిగినట్లు కొందరు వ్యక్తులు ఉపాధ్యాయ సంఘాలకు తప్పుడు సమాచారం అందించడంతోనే ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.
వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేయడం బాధాకరమని, ఎంఈవో శ్రీదేవి ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిన అసత్య ప్రచారాలను 2008-డీఎస్సీ ఉపాధ్యాయులందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
ఖండన తెలిపిన ఉపాధ్యాయులు:
ఈ. అరుణ, జె. స్వప్న, పి. స్వప్న, వి. సుమతి, పి. పద్మజ.
ఇట్లు,
2008-డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, కాటారం మండలం.



Post A Comment: