మహాదేవపూర్, జూన్ 19: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిని ఓర్వలేక కొందరు నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆలయ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు దేవాలయ అభివృద్ధి పనులపై అవాస్తవ ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేవస్థాన అభివృద్ధి కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభం కాకముందే రూ.100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. భక్తుల సహకారం, ప్రభుత్వ నిబద్ధతతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పవిత్ర క్షేత్రాన్ని రాజకీయాలకు వేదికగా మార్చడం సరికాదని తెలిపారు.
లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మెడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో రాష్ట్రానికి జరిగిన నష్టంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే హత్యలు, కుట్రలు, భూదందాలు, రౌడీయిజం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు నైతిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మహాదేవపూర్ ప్రాంత ప్రజలు వాస్తవాలను గుర్తించి అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అఫ్జల్ ప్రకాశ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, గ్రామ సర్పంచ్ హసీనా బానో, ఎక్స్‌పీఎస్సీఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సుధాకర్, కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్, రామన్ రావు, తిరుపతిరెడ్డి, శంకరయ్య, శివరాజు, సంతోష్, మోత సాంబయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి కోట సమ్మయ్య, వార్డ్ సభ్యులు గడ్డం స్వామి, నయూముద్దీన్, మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: