మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
2023.మార్చి.25,26,27 తేదీ లలో మంచిర్యాల జిల్లాలో జరుగు భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) తెలంగాణ రాష్ట్ర 9వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ గోదావరిఖని ఐ ఎఫ్ టి యు కార్యాలయం వద్ద ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.
*ఈ సందర్భంగా ఐ యఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఈదునూరీ నరేష్. మాట్లాడుతూ 1978లో గౌహతిలో విప్లవ కార్మిక సంఘం ఐ యఫ్ టి యు ఆవిర్భవించిన దగ్గర నుండి నాలుగున్నర దశాబ్దాలుగా కార్మిక సమస్యల పరిష్కారం కోసం, సమసమజ స్థాపనే ధ్యేయంగా కార్మిక రాజ్య స్థాపన లక్ష్యంతో ఐఎఫ్టియు పనిచేస్తుందని అన్నారు.
గతంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నేడు కేంద్రంలో మోడీ సర్కారు 44 చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా మార్చి కార్పొరేటు కంపెనీల ప్రయోజనాలను నెరవేరుస్తుందని విమర్శించారు.
రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం బిజెపికి వ్యతిరేకం అంటూనే మోడీ విధానాలని అవలంబిస్తుదని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో వైఫల్యం చెందాయని విమర్శించారు.
ఈ రాష్ట్ర మహాసభలో గత పోరాటాలను,ఉద్యమాలను సమీక్షించుకొని, భవిష్యత్ పోరాటాలను రూపొందించుకుంటున్న ఈ మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు . ఎస్ సి సి డబ్ల్యూ యు రామగుండం రీజియన్ కార్యదర్శి కోండ్ర మొగిలి,జిల్లా నాయకులు ఎం దుర్గయ్య, సాయి, హరి,దీక్షాకుమారి,రాజేశ్వరి,గుండ్ల పోచం, కుమార్, ఎం మల్లేశం, శంకర్, కొమరయ్య.
తదితరులు పాల్గొన్నారు
Post A Comment: