మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని బస్టాండ్ ఏరియా రహదారిపై నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో భాగంగా *పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత వాయినాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికమని, భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుందని,
కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయడానికి ఇంకా సమయం ఉండగానే *పార్లమెంటు సభ్యుడిగా అనర్హత గెజిటె విడుదల చేయడం రాహుల్ గాంధీని ఇబ్బందిపరచడానికి
ఈ దేశంలో *ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం, లౌకికవాద రక్షణ కోసం *భారత్ జోఢో రాజకీయంగా కాంగ్రెస్కు కలిసి వచ్చిందని రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే *ఫాసిస్టు, ఫ్యూడల్ లక్షణాలతో*మోడీ సర్కార్ఈ అక్రమ గెజిట్ విడుదల చేసిందని విమర్శించారు
ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచించి అనర్హత గేజిట్ వెనక్కి తీసుకోవాలని, కోర్టు ఆదేశాలు వచ్చేంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బొంతల రాజేష్, ఫ్లోర్ లీడర్మహంకాళి స్వామి, 50 డివిజన్లో కోఆర్డినేటర్ కాల్వ లింగస్వామి, కార్పొరేటర్ పెద్దల్లి తేజస్విని -ప్రకాష్,తాళ్లపల్లి యుగేందర్, మాజీ కార్పొరేటర్చుక్కల శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ నసీముద్దీన్,NSUI దాసరి విజయ్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: