మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
:కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీపై లోక్ సభ అనర్హత వేటు వేయడాన్ని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు నొక్కేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందని ఆరోపించారు. కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల లోపే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం దారుణమన్నారు. ఇది అప్రజాస్వామికమని ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని అన్నారు. ఇలాంటి అమానుష చర్యలను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
Post A Comment: