ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;హెలిప్యాడ్, పార్కింగ్ స్థలం, సభా స్థలి, శంకుస్థాపన చేసే కార్యక్రమ స్థలాలను పరిశీలించారు.
అనంతరం ఆయా చోట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త ల పై అధికారులకు తగు సూచనలు చేశారు.
కార్యక్రమాలు జరుగుతున్న చోట్ల, మంచినీటి ట్యాంకర్ల తో నీటిని సరఫరా చేయాలని, అధికారులను, గ్రామ కార్యదర్శులను, ఇతర సిబ్బందిని, నియమించి పారిశుద్ధ్య పనులు నిర్వర్తించాలని, రోడ్లపై నీటిని చల్లి, దుమ్ము లేవకుండా చేయాలని మంత్రి హనుమకొండ డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్ ను ఆదేశించారు.
అధికారులంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
అధికారులతో కొద్దిసేపు మాట్లాడి ఆనాటి కార్యక్రమాల పై సమీక్షించారు
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య, ఎమ్మెల్సీ, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,
ఈ నెల 27న ఒకే రోజు 150 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేస్తారు.
అత్యంత ఎత్తు గా ఉన్న, కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్న ఆ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించే 3 ఎత్తిపోతల ప్రాజెక్టులకు, వివిధ రోడ్లకు శంకుస్థాపనలు జరుగుతాయి.
అనంతరం ఈ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందేలా చేసిన సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతగా ఈ ప్రాంత రైతుల కృతజ్ఞత సభ భారీ ఎత్తున 30 వేల మందితో ఘనంగా జరుగుతుంది.
ఇప్పటి వరకు అంతా చెప్పారు. ఎవరూ ఏమీ చేయలేదు.
సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి నిధులు ఇచ్చి, 3 లిఫ్టులు ఏర్పాటు చేస్తున్న మనసున్న మహారాజు కెసిఆర్.
గతంలో ఎప్పుడూ ఈ స్థాయి అభివృద్ధి జరగలేదు.
ప్రతి పక్షాలు చెప్పే మాటలకు ప్రజల్లో విలువ లేదు.
ప్రజలు రాష్ట్రంలో బిఆరెస్ తప్ప ఇతర పార్టీల ను పట్టించుకోవడం మానేశారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక, మతి భ్రమించి మాట్లాడుతున్నారు.
వాళ్ళ మైండ్ దొబ్బింది. వాళ్ళతో అయ్యేది ఏమీ లేదు.
ప్రజలు బిఆరెస్ పక్షానే ఉన్నారు.రాష్ట్రాన్ని శస్యశ్యామలం చేస్తూ, ప్రతి ఎకరాకు సాగు నీరు అందించే లక్ష్యం లో భాగంగానే, ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టులు వచ్చాయి
సీఎం కెసిఆర్ కి, కేటీఆర్ కి ప్రజలు రుణపడి ఉంటారు. సమయం వచ్చినప్పుడు వారు తమ మద్దతు తెలుపుతారు.
ప్రజలను కడుపులో పెట్టుకొని కెసిఆర్ చూసుకుంటున్నారు. అందుకే ప్రజలు బిఆరెస్ కు అండగా ఉన్నారు.
కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయడానికి పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు కదిలి రావాలి.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఆర్ అండ్ బి
అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, జనగామ పార్టీ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, లింగాల ఘనపూర్ జెడ్పీటీసీ గుడి వంశీ ధర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.