ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ మర్కజి మరియు ప్రాక్టీసింగ్ పాఠశాలలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అభ్యసన దీపికలు ఎగ్జాం కిట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో చీఫ్ విప్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా "మన బస్తీ మనబడి" కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. విద్యార్థుల విజ్ఞానానికై అభ్యసన దీపికాలు అందిస్తున్నామని తెలుపుతూ విద్యార్థుందరికీ పరీక్షలు రాయడానికి అవసరమయ్యే పరికరాలను అందించిన సంతోష్ కి అభినందనలు తెలిపారు. మన బస్తీ మన బడి కార్యక్రమములో భాగంగా 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అదే సమయంలో కార్పొరేట్ పాఠశాలలకు
ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. శుక్రవారం పిల్లలతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
Post A Comment: