ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పోలీస్ స్టేషన్ కు సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివాస్ కార్యక్రమం లో భాగంగా జిల్లా లోని వివిధ మండలాల నుంచి వచ్చిన 14 మంది బాధితుల పిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివిధ రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారికి న్యాయం చేకూర్చే విధంగా భరోసా కల్పించాలని అన్నారు. బాధితుల సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి, విచారణ చేపట్టి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘవిద్రోహక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పి ఆదేశించారు.
Post A Comment: