మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తల్లిదండ్రుల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా పిల్లలు జీవనాన్ని కొనసాగిస్తే, సమాజంలో తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయని, యువత బంగారు భవిష్యత్తు కోసమే నా తపన తాపత్రయమని.. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. స్థానిక దుర్గానగర్ లోని ఆర్కే ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు, పరీక్షల్లో విజయసాధనకు ఏర్పాటుచేసిన మోటివేషనల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు గర్వించే స్థాయికి పిల్లలు ఎదగాలని అందుకు అనుగుణంగానే పిల్లలు జీవనాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో జీవితాన్ని ఎలా మార్పు చేసుకోవాలనేది మన చేతుల్లోనే ఉందన్నారు. రామగుండం చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా లేనివిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉన్నత లక్ష్యం ఎంచుకొని, సమయపాలనను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని.. ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చి, ఉపాధి కోసం స్థిరపడ్డారన్నారు. పట్టుదల, తపన, తాపత్రయం కలిగి ఉంటే ఏదైనా సాధించవచ్చునని, అందుకు తానే ఒక ఉదాహరణని పేర్కొన్నారు. సామాన్య మధ్యతరగతి సింగరేణి కార్మిక కుటుంబంలో జన్మించిన తాను, ప్రజలకు సేవ చేయాలనే ధృఢ సంకల్పంతో ముందుకు సాగానని, చివరకు విజయం సాధించానన్నారు. ఇతరుల సంక్షేమం కోసం కృషి చేస్తే, తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉద్యమించి..తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందన్నారు. చక్కటి ప్రణాళికతో కష్టపడితే విజయం తధ్యమని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. స్థానిక యువత కోసం, ప్రజల కోసం ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.రామగుండం ప్రజల స్థితిగతుల మార్పు కోసం, వారి ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగానని, అందుకనుగుణంగానే స్థానికంగా మెడికల్ కళాశాల ఏర్పాటు చేశానన్నారు. 24 గంటల పాటు కార్పోరేట్ వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చునని ఎమ్మెల్యే తెలిపారు. గొప్ప ఆలోచన కలగాలని పట్టుదల పెరగాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో నిర్వహించిన ఎమ్మెల్యేగా తెలిపారు. కాగా స్క్వాడ్రన్ లీడర్ జయసింహ ఇచ్చిన మెలకువలు, ప్రేరణ, స్ఫూర్తిదాయక కథలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఏం నేర్చుకున్నారని ఎమ్మెల్యే విద్యార్థులను అడగగా.. బండారి వైష్ణవి అనే విద్యార్థిని ధైర్యంగా స్టేజ్ పైకి వచ్చి తాను నేర్చుకున్న అంశాలను వివరించడం జరిగింది. విద్యార్థిని ప్రతిభకు మెచ్చి ఎమ్మెల్యే ఆమెకు అవసరమైన పుస్తకాలను యూనిఫామ్లను ఉచితంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే విధంగా కోరుకంటి స్టడీ సర్కిల్ అనే యాప్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే జయసింహ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు రమణారెడ్డి బాలరాజు కుమార్, కో-ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, నాయకులు ధరణి జలపతి, తానిపర్తి గోపాలరావు, దయానంద్ గాంధీ, పీఎస్ అమరేందర్, బెందె నాగభూషనం గౌడ్, ప్రభంజన్ రెడ్డి, చిలుముల నాగరాజు, యూత్ నాయకులు మేకల అబ్బాస్, ఇరుగురాల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: