మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని బృందావన్ ఫంక్షన్ హాల్ లో కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి ఓబి కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది ఓబిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రావలసిన వేతనాల సవరణ కొరకు కార్మిక సంఘాల జేఏసీ తలపెట్టిన మార్చి 6 సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులు అందరూ ఒక తాటిపై ఉండి పార్టీలకతీతంగా కలిసి రావాలని హక్కులు సాధించుకునే విధంగా పోరాటాలకు సిద్ధం అయి ఉద్యమించక తప్పదని సంఘాల నాయకులు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు గత నాలుగు సంవత్సరాలుగా కార్మికులకు పెరగవలసిన వేతనాలు కోవిడ్ సమయంలో ప్రాణాపాయం ఉందని సమ్మెను విరమింపజేసి ప్రజ కార్మిక ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడున్న సిపి గారు కోవిడ్ తర్వాత సరైన వేతనాలు ఇప్పిస్తామని చెప్పి వాగ్దానం చేయడంతో సమ్మె విరమించుకొని యజమాన్యానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి సహకరించడం జరిగింది కానీ అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో రెప్రెటేషన్లు చేసిన స్పందించని సింగరేణియజమాన్యం ఓబీ యజమాన్యం మాట తప్పడంతో కార్మిక సంఘాల జేఏసీ మళ్లీ ఒక తాటిపైకి వచ్చి మార్చి ఆరో తారీకు వరకు యజమాన్యానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఓబి యజమాన్యం కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఎలాంటి స్పందన లేకుండా ఉన్నందున రామగుండం రీజినల్ లో అన్ని బోబిలా కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసి గేట్ మీటింగ్లో పెట్టి కార్మికులని ఒక తాటిపైకి తీసుకువచ్చి కచ్చితంగా యజమాన్యం మెడలు వంచన సరే కార్మికులకు రావాల్సిన పెరగవలసిన వేతనాలు కార్మిక హక్కులను సాధిస్తామని కార్మిక సంఘాల జేఏసీ కార్మికుల మధ్య వాగ్దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బుర్ర తిరుపతి గౌస్ శనిగరపు శ్రీనివాస్ శాతవాహన మల్టిపుల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం యూనియన్ నాయకులు కౌశిక్ హరి ఐ ఎన్ టి యు సి నాయకులు పూసాల తిరుపతి టి కే ఏస్ బి నాయకులు మద్దెల శ్రీనివాస్ ఐఎఫ్టియు అనుబంధ సంఘాల నాయకులు తోకల రమేష్ ఆకుల వెంకన్న సిఐటియు నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Post A Comment: