మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మంథని నియోజకవర్గంలోని, అన్ని మండలాల పరిధి, గ్రామాలలోని ప్రజలంతా కల్మషం లేని కమలానికి ఆకర్షితులై, బిజెపి వైపు పయనిస్తున్నారు.గతంలో పరిపాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం పరిపాలనలో ఉన్న అవినీతి (టిఆర్ఎస్) బిఆర్ఎస్ రెండు పార్టీల ప్రభుత్వాలు తోడు దొంగలేనని, ప్రజలు చర్చించుకుంటున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందుబాటులో ఉండి, వారి కష్ట సుఖాలలో భాగస్వామి అయిన పేదల ఆశాజ్యోతి, మంథని డైనమిక్ మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి కి,ప్రతి గ్రామంలో తనకున్న అన్ని వర్గాల వీరాభిమాన నాయకులు, సోదరీమణులు, యువకులు, ప్రజలందరి పరిచేయాలతో తనయుడు సునీల్ రెడ్డి చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు మహాదేవపూర్, పలిమెల, మహా ముత్తారం, మల్హర్, కాటారం మండలాలలోని ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో, మంథని నియోజకవర్గం లో ఒక్కసారే రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అభివృద్ధి లక్ష్యంగా, పేదలకు అండగా ఉచిత విద్య, ఉచిత వైద్యం, సత్వర న్యాయం, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్, పేదలకు గృహాల మంజూర్ వంటి ఉపయోగపడే నమ్మకమైన హామీలు ఇస్తూ ప్రజలకు ఆకర్షితులవుతున్నారు. మంథని నియోజక వర్గం గడ్డపై వచ్చే ఎన్నికలలో బిజెపి అభ్యర్థి చందుపట్ల సునీల్ రెడ్డి కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మంథని బిజెపి ఎమ్మెల్యేగా గెలిపించి, అసెంబ్లీకి పంపించాలని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు.
Post A Comment: