మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పవిత్ర షిర్డి లొ స్వర్గీయ  కన్నూరి సౌందర్యమ్మ జ్ఞాపకార్థం  అన్నదానం నిర్వహించిన రామగుండం 20వ డివిజన్ కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్. షిర్డి లొ నిత్య ఉచిత భోజన వసతి కల్పిస్తున్న గురూజీ అన్నదాన క్షేత్రంలొ అన్నదానం ఏర్పాటు చేయించారు. ఈ క్షేత్ర నిర్వహకులు నిత్య సాయి ఉపాసకులు శ్రీ నీలకంఠ మహదేవ గురూజీ.  రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలొని శ్రీ షిర్డి సాయిబాబా మందిర కమీటీ ఛైర్మన్ గా 27 సంవత్సరాలు గా సేవలందిస్తున్నారని తెలిసి శాలువతొ , పూలమాలతొ, సాయిబాబా చిత్ర పటం అందించి,  పూలుజల్లి సత్కరించి, అశీర్వదించిన శ్రీ నీలకంఠ మహదేవ గురూజీ*ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతు " సాయి భక్తుడిగా ఉండడమే గొప్ప అదృష్టమని, అందులొ సాయి మందిరం నిర్మించడం, నిత్య పూజలు నిర్వహించడమంటె పూర్వ జన్మ సుకృతమని, తల్లిదండ్రులను మరువని వారికి ఆ సాయి అశీస్సులు ఎపుడు ఉంటాయని, తన తల్లి పేరిట అన్నదానం నిర్వహించడం,  నిరంతరం సాయి సేవలొ ఉంటున్న కన్నూరి సతీష్ కుమార్ అభినందనీయుడని" అన్నారు. ఈ సందర్భంగా కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతు " ఆ శిర్డి సాయి దశాబ్దకాలం అనంతరం షిర్డి రావడమైనదని, ఆ బాబా దర్శించుకుంటె చాలనుకుంటె, ఇక్కడి గురూజీ అన్నదాన క్షేత్రంలొ మా అమ్మగారు స్వర్గీయ  కన్నూరి సౌందర్యమ్మ జ్ఞాపకార్థం అన్నదానం నిర్వహించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని, ఈ సమయంలొ బాబా పరమ భక్తులు తరచు హిమలయలలొ సాయిదీక్ష ధ్యానం ఉండె శ్రీ నీలకంఠ మహదేవ గురూజీ స్వయంగా సత్కరించడం నిజంగా గొప్ప గౌరవం గా భావిస్తున్నాని, శ్రీ షిర్డి సాయికృపతొ, మా ఆమ్మ,నాన్నల అశీర్వాదంతొ, వీలైనంతగా మాధవ సేవను, మానవ సేవను నిరంతరం కొనసాగిస్తు ఉంటానని " అన్నారు. ఈ కార్యక్రమంలొ మందిర కార్యదర్శి కలవేని.మల్లేశం, పూజారి రాంపెల్లి శ్రీనివాశ్ శర్మలను కూడ సన్మానించారు. రామగుండం సాయి భక్తులు కె.కె.స్వామి, కె.రాకేష్, పి.రవివర్మ లు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: