మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
యైటింక్లయిన్ కాలనీ, ఫిబ్రవరి 26: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం యైటింక్లయిన్ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు దుర్గం శంకర్ - వసంత దంపతుల తృతీయ కుమారుడు శ్రీనాథ్ ఎమ్మెస్ లో ర్యాంకు సాధించి కెనడాకు వెళ్తున్న సందర్భంగా ఆదివారం నాడు సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు, సమత ఫౌండేషన్ చైర్మన్ నగేష్ , తెలంగాణ నేతకాని మహర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దర్శనాల భువనచంద్ర తో కలిసి శ్రీనాథ్ ను అభినందించారు. ఈ సందర్భంగా వారు శ్రీనాథ్ కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ.. కష్టపడి చదివించిన తల్లి-దండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, సమాజానికి,రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఎదగాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఏ అవసరం వచ్చినా తమకు సంప్రదించాలని తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ తల్లిదండ్రులు దుర్గం శంకర్-వసంత , అన్నయ్యలు విశ్వనాధ్ సాయినాథ్ తదితరులు ఉన్నారు
Post A Comment: