ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పోలీసు అధికారులు, సిబ్బంది, హోంగార్డ్స్, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా ఆర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో ఎస్పి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుండి మూడు రోజుల పాటు నిర్వహించబడే ఈ కార్యక్రమములో పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్న కంటి పరీక్షల నిర్వహణ తీరుతెన్నులపై ఎస్పి సంబంధిత అధికారులు, కంటి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పి సిబ్బందికి కంటి అద్దాలు, మందులను అందజేసారు.
అనంతరం ఎస్పి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది, తమ ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపాలని, ముఖ్యంగా కంటి సమస్యల పట్ల అశ్రద్ధ వహించవద్దని అన్నారు. పోలీసు సిబ్బంది అందరికీ కంటి పరీక్షలు జరిపి, అవసరమయిన వారికి కంటి అద్దాలను, మందులను అందించడం జరుగుతుందన్నారు. పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వి శ్రీనివాసులు ఎస్బి ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, బండ సతీష్, సంతోష్, డాక్టర్లు, ఉమాదేవి, భాస్య, నర్మద, విద్యాసాగర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: