ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఉమ్మడి వరంగల్ జిల్లా
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలో 150 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
సోమవారం మంత్రి కేటీ ఆర్ హైదరాబాద్ నుండి నేరుగా మధ్యాహ్నం 1.55 గంటలకు సోడాషపల్లి లోని రైతు వేదిక ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకన్నారు.రాష్ట్ర ఐటి, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీపీ రంగనాధ్ ఇతర ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే తాటికోండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలో ఎత్తైన ప్రాంతాలైన చిల్పూరు, ధర్మసాగర్, వేలేరు మండలాలకు సాగునీరు అందించేందుకు దేవాదుల పైప్ లైన్ ద్వారా 3 మిని ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. ఈ మూడు మినీ ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం 104 కోట్లు ఖర్చు చేసి నిర్మించనుంది. 3 లిఫ్ట్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
అనంతరం ధర్మసాగర్ మండల కేంద్రం నుంచి వేలూరు మండల కేంద్రం వరకు 25 కోట్లతో వేసిన డబుల్ రోడ్డును ప్రారంభించారు, అనంతరం నారాయణగిరి నుంచి పీచురు వరకు 10 కోట్లతో వేసే డబుల్ రోడ్డు పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
అనంతరం సోడాషపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన రైతు కృతజ్ఞత సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.


Post A Comment: