ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సీనియర్ వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృత్యువుతో పోరాడి మృతిచెందిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఘటన మరవక ముందే వరంగల్ నగరంలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. సీనియర్ వేధింపులు తాళలేక ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే... భూపాలపల్లికి చెందిన శంకరాచారి-రమ దంపతుల కుమార్తె రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతోంది. రక్షిత మరొకరితో కలిసి ఉన్న ఫోటోలను సీనియర్ విద్యార్థి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయడంతో మనస్తాపానికి గురైంది. దీంతో వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రక్షిత మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. రెండు రోజుల క్రితం భూపాలపల్లిలో రక్షిత మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Post A Comment: