ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఈ నెల 27న వేలేరు మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా వేలేరు మండలం సోడాశపల్లి గ్రామ రైతు వేదిక ముందున్న స్థలంలో హెలిపాడ్ ఏర్పాటు చేయనుండగా.. ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు చోట్ల పార్కింగ్ ప్లేసులు, 30 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనుండటంతో వాటికి సంబంధించిన స్థలాలనూ సందర్శించారు. అనంతరం వరంగల్ ఏనుమాముల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మార్కెట్ సబ్ యార్డ్ ను సందర్శించి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గండి రామారం, కన్నారం, గుండ్ల సాగరం వద్ద నిర్మించనున్న మూడు లిఫ్ట్ లకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనుండగా.. ఆ పనులనూ పరిశీలించారు. వారి వెంట డీఆర్వో వాసు చంద్ర, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ కుమార్, డీసీసీబీ డైరెక్టర్, ధర్మసాగర్ పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఎంపీపీ సమ్మి రెడ్డి, తదితరులు ఉన్నారు.
Post A Comment: