ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం రోజున దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ ప్రజావాణి కార్యక్రమానికి 06 దరఖాస్తులు వచ్చాయని, వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులకు పంపించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అథికారి సూచించారు, ఇందులో 01 దరఖాస్తులు వ్యక్తిగత లోన్ల కోసం, 01 దరఖాస్తులు దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం, 02 దరఖాస్తు సదరం సర్టిఫికెట్ కోసం,01 దరఖాస్తులు ట్రేడ్ లైసెన్స్ కోసం, 01దరఖాస్తులు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం, సమర్పించారని జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత తెలిపారు.
కార్యక్రమంలో డీఎమ్&హ్ చ్ఓ , అబ్దుల్ డిఈఓ, ఎజాస్ అహ్మ్ ద్ బిసీడబ్లు, డిఆర్డివో శ్రీనివాస్ కమార్,ఆర్ & బి రవీందర్ , రవీందర్ సీహ్చ్ఒ, ఈడిఎస్సి కార్పోరేషన్ మాధవిలత, అనితారెడ్డి, మెప్మా నుండి రజిత , దివ్యాంగులు మరియు, సిడిపివో మధురిమ, భాగ్యలక్ష్మీ , స్వరూప, బీఆర్బీ కోఆర్డినేటర్ శిరీష, సఖి లీగల్ కౌన్సలర్ శ్రీదేవి ,జె ఏ రేవంత్ బాబు, ఎఫ్ఆర్వో రవి క్రిష్ణ,
దివ్యాంగుల జేఏసి కన్వీనర్ నల్లెల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: