మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు *ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని 5ఇన్క్ లైన్ కాలనీ కి సంబంధించిన బూత్ ల కార్నర్ మీటింగ్ శక్తికేంద్రం అధ్యక్షులు బండి రాము ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బిజెపి రాష్ట్ర నాయకులు రామగుండం మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పాల్గొన్నారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం అభివృద్ధి లో కుంటు పడిందన్నారు. ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు చాలా విసిగి చెంది ఉన్నారని రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అదేవిధంగా గడిచిన ఈ నాలుగేండ్ల లో అభివృద్ధి మాత్రం శూన్యం అన్నారు. నరేంద్ర మోడీ చేస్తున్న దేశ సేవకు ఆకర్షితులైన రామగుండం ప్రజలు కాషాయం జెండా ఎగురవేసేందుకు ఎదురుచూస్తున్నారని అన్నారు.
ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ , బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ, మండల అధ్యక్షుడు డేవిడ్, మామిడి వీరేశం, మహేష్, రాజ్ కుమార్, శక్తి కేంద్రం ఇన్చార్జీలు,బూత్ అధ్యక్షులు,బిజెపి నాయకులు, కార్యకర్తలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: