ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
రాష్ట్ర ఐటి మరియ పురపాలక శాఖామంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలోని మంత్రుల పర్యటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా ఎస్పీ జే. సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం నుంచే పోలీసులు కేటీఆర్ మరియు మంత్రులు పర్యటించే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 1000 మందితో బందోబస్తును కట్టుదిట్టంగా నిర్వహించారు. కేటిఅర్ మరియు మంత్రులు గణపురంలో దిగింది మొదలు భూపాలపల్లి కార్యక్రమాలు ముగించుకొని వెళ్లే వరకు ఎస్పీ సురేందర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా పోలీసులతో పాటు, ఇతర జిల్లా పోలీసులు కూడా ఎండ తీవ్రతను లెక్కచేయక విధులు నిర్వర్తించారని, ఎలాంటి ఘటనలు లేకుండా సమర్ధవతంగా పనిచేశారని సురేందర్ రెడ్డి పోలీసులను అభినందించారు.


Post A Comment: