మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

CPI (M-L) న్యూడెమోక్రసీ అనుబంధ ప్రగతిశీల యువజన సంఘం (PYL) పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామగుండం హౌసింగ్ బోర్డ్ వద్ద ఉన్న కామ్రేడ్ కత్తెరమల్ల పోచన్న, ఆరుముళ్ళ భూమన్నల 31వ వర్థంతి సభను స్మారక స్తూపం వద్ద నిర్వహించడం జరిగింది.     ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఐ క్రిష్ణ మాట్లాడుతూ..గత 30 ఏళ్ల క్రితం అతివాద అరాచక శక్తులు అత్యంత కిరాతకంగా పీ వై ఎల్ నాయకులు కామ్రేడ్ కత్తరమల పోచన్న ను కొంతమంది విప్లవ ముసుగులో అతివాద అరాచక శక్తులు అత్యంత దారుణంగా హత్య చేయగా,  అలాగే కామ్రేడ్ ఆరుముళ్ళ భూమన్నను పోలీసు భూటకపు  ఎన్ కౌంటర్ లో హత్య చేయబడ్డాడు. 

ఈ హత్యల ద్వారా కొంత మంది ఆనందం పొందారని ఈ ప్రాంతంలో విప్లవ పార్టీ ని లేకుండా చేయాలని అనేక కుట్రలు కుతంత్రాలు చేశారన్నారు, వారి కుట్రలను కుతంత్రాలను ఎదిరించి ఈ ప్రాంతంలో పార్టీని నిలబెట్టుకొని ప్రజా పోరాటాల్లో ముందున్నామని అన్నారు.

   కామ్రేడ్ కత్తరమల్ల పోచన్న, ఆరు ముళ్ల భూమన్నలు దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకమైన విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు పోరాటాలు నడిపిన విప్లవ వీర కిశోరాలని, వీరి పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దామని అప్పుడే పోచన్న, భూమన్నలకు నిజమైన నివాలులని అన్నారు. 

   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ఎన్నికల సందర్భంలో ఎన్నో వాగ్దానాలు చేశారని ప్రజలకు యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. 

   కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు 9 ఏళ్ల పాలనలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా నిరుద్యోగ యువతను గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది, ఇప్పటికైనా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని అందుకు అమరులు అందించిన పోరాట స్ఫూర్తితో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఈ సందర్భంగా ప్రజలకు యువతకు పిలుపునిచ్చారు.

   ఇంకా ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కె మల్లేష్, నాయకులు మేరుగు చంద్రయ్య, పైడిపల్లి రమేష్, PYL రాష్ట్ర నాయకులు ఆరుమూళ్ళ తిరుపతి, జిల్లా అద్యక్షుడు కసిపేట దర్మెందర్, ఉపాధ్యక్షుడు సమ్మెట తిరుపతి, AIKMS జిల్లా నాయకులు వేల్పుల సాంబన్న, నాయకులు కాదాసు లింగమూర్తి, మొగిలన్న, తీగుట్ల నవీన్, B సాగర్, E బాబు, K కిషన్, ప్రేమ్, R ప్రశాంత్, P స్వామి, M జంపయ్య, M రాజరాం తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: