మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
CPI ML ప్రజాపంధా ఆధ్వర్యంలో పెద్దంపేట రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా CPI ML ప్రజాపంధా జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణరెడ్డి, జిల్లా నాయకురాలు కోడిపుంజుల లక్ష్మీ హాజరై మాట్లాడుతూ పెద్దంపేట రైల్వే గేట్ మూలంగా 20 గ్రాముల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భిణీ స్త్రీలు, డ్యూటీకి వెళ్లే కార్మికులు, మహిళలు, విద్యార్థులు రైల్వే గేట్ మూలంగా అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది.
పెద్దంపేట గ్రామ ప్రజలు వ్యవసాయ పనులకు చేతి వృత్తుల పనులకు గీతా కార్మికులు మరియు పశువులు మేతకు పోవడానికి తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు కావున వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం,
పెద్దంపేట రైల్వే స్టేషన్లో గతంలో ఆగిన రైలు అన్నీ కూడా ఆపాలని కోరుతున్నాం ప్యాసింజర్ ఇంటర్సిటీ తెలంగాణ లు ఆపలని డిమాండ్ చేస్తున్నాం
గత మూడు సంవత్సరాల క్రితం ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతి వచ్చిందంటూ ప్రచారం చేసుకున్న పాలకులు ఫ్లైఓవర్ నిర్మించడంలో మాత్రం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికైనా పెద్దంపేట రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించి ప్రజల అవస్థలు తీర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనట్లయితే సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని తెలియజేశారు. *ఈ ధర్నా కార్యక్రమంలో CPI ML ప్రజాపంధా జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, గుమ్మడి వెంకన్న, పెండ్యాల రమేష్, ఆడేపు శంకర్, భూషవేణి క్రిష్ణ, కోడిపుంజుల మహిపాల్ కల్పన,స్వప్న భీమన్న ,తమనవేణిి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: