మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మగారాన్ని తిరిగి జాతికి అంకితం చేసిన నరేంద్ర మోడీ దేశానికి గర్వకారణం అని *బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ  అన్నారు.

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్  ఆదేశాల మేరకు *ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా జనగాం మండలంలోని శక్తి కేంద్రం 63, 64, 67 బూత్ ల కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 

జనగామ మండల అధ్యక్షుడు జనగాం రాజలింగు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్నర్ మీటింగ్లో ముఖ్య అతిధిగా *బిజెపి రాష్ట్ర నాయకులు రామగుండం మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ   పాల్గొన్నారు.

ఈసందర్బంగా వారు మాట్లాడుతూ 

భారతదేశంలో వ్యవసాయ రంగం ప్రధాన పాత్ర పోషించే క్రమంలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన దేశానికి అవసరమయ్యే యూరియాను మనమే తయారు చేసుకోవాలనే గొప్ప సంకల్పంతో మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మగారాన్ని తిరిగి పున:ప్రారంభించి జాతికి అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. దీనివలన దేశంలో ఎరువుల కొరత తీరడంతోపాటు రైతుల కండ్లల్లో ఆనందం చూసేందుకే కరోణ కష్ట కాలంలోనూ నిధుల కొరత రాకుండా వేగవంతంగా ఎఫ్.సి.ఐ ని పూర్తి చేసి తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు.

ఫలితంగా రైతును రాజు చేసిన కీర్తి నరేంద్ర మోడీకి దక్కిందన్నారు.

ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు  సోమారపు లావణ్య అరుణ్ కుమార్ , బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ కోశాధికారి కాసిపేట శివాజీ, కార్పొరేషన్ అధ్యక్షులు లక్ష్మణ్, కోఆర్డినేటర్ గాండ్ల ధర్మపురి, శక్తి కేంద్రం అధ్యక్షుడు కదాషి శంకర్,బూత్ అధ్యక్షులు శివకుమార్, రాజలింగు, సుదీర్ మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: