మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

నర్సింహా సికింద్రాబాద్ కాంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న  చనిపోయిన విషయం అందరికి తెలిసిందే, అధికార పార్టీ కీ చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ సాయన్న కు ముఖ్యమంత్రి కెసిఆర్ తీరని అవమానం చేసిండు దళితులు అంటే కెసిఆర్ కు ముందు నుండి చిన్నచూపు సాయన్న విషయం లో కూడా అదే జరిగింది.సాయన్న గొప్ప నాయకుడు 5 సార్లు గెలుపొందిన ఎమ్మెల్యే ఇప్పటి అధికారపార్టీ బి. ఆర్.స్. ఎమ్మెల్యే అయినా కూడ అంత్యక్రియలు అధికార లంచనలతో కార్యక్రమలు చేయక పోవడం కెసిఆర్ కి దళితుల పై వున్నా వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. పక్క రాష్ట్రం లో ఉన్నా ఆంధ్ర సినీ రాజ్యకీయ ప్రముఖులకు అలాగే తెలంగాణ ప్రజలను లో, తీవ్ర అవమానం అణిచివేతకు గురి చేసి, ఎందరో తెలంగాణ ప్రజల మాన ప్రాణాలతో చెలగాటం ఆడిన నిజాం రజాకార్ల వారసుల కు ప్రజా ధనాన్ని వెచ్చించి ఈ తెలంగాణా లో అంత్యక్రియలు అధికార లంచనలతో చేసి సొంత రాష్ట్రము అయినా తెలంగాణాలో దళితులు ఇంకా వివక్ష కు గురి అవుతావున్నారు. దళిత ముఖ్యమంత్రి ఇస్తానని మాయమాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ దళితులని అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్నారు. ఒక దళిత ఎమ్మెల్యే కు జరిగిన అన్యాయాన్ని *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి  తీవ్రంగా ఖండిస్తుంది, కెసిఆర్ తన పొందిన రాక్షస ఆనందం దొరతనానికి తార్మానమని మండిపడ్డారు ఐదుసార్లు కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి తుది శ్వాస వరకు ప్రజా సేవకు తపించిన అజాతశత్రువు సాయన్నని అన్నారు. రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతామన్నారు.. భవిష్యత్తులో తగిన మూల్యం చెలించుకోక తప్పదని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్  హెచ్చరించారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: