ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ భూపాల పల్లి జిల్లా ములుగు ఘనపురం చేరుకున్న బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ములుగు జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్, గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు హాజరయ్యారు.
అనంతరం మంత్రి కేటీఆర్
ములుగు ఘనపురంలో
మండల తహశీల్దార్ నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. అలాగే, జ్యోతిరావు ఫూలే బాలికల ఆవాస పాఠశాలకు, సింగరేణి వెయ్యి క్వార్టర్స్ కి ప్రారంభోత్సవం చేశారు. అలాగే భూపాలపల్లి కి చేరుకున్న మంత్రి కేటీఆర్.
భూపాలపల్లి లో
అర్ అండ్ బి అతిథి గృహానికి, దివ్యాంగుల కమ్యూనిటీ హాలుకు,
డబుల్ బెడ్ రూం ఇండ్ల కు ప్రారంభోత్సవం చేశారు.
Post A Comment: