మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి ప్రభావిత ప్రాంతమైన ముస్త్యాల గ్రామ నివాసులు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును వేడుకొనగా, తమకు ఓసిపి ఫైవ్ లో ఉపాధి కల్పిస్తామని చెప్పగా, గ్రామ నివాసులు 10 మంది, దానికి సంబంధించిన వి.టి.సి. ట్రైనింగ్ కంప్లీట్ చేసినా కూడా, పీసీ పటేల్ కంపెనీవారు ఉపాది ఇవ్వకుండా జాప్యం చేస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని వేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగం ఇవ్వకుండా జాప్యం చేస్తూ తమని, తమ కుటుంబాలను మానసికంగా వేదనలకు గురి చేస్తున్న పటేల్ కంపెనీ పై చర్య తీసుకొని తమకు ఉపాధి కల్పించి తమకు, తమపై ఆధారపడే కుటుంబాలను కాపాడమని, జిల్లా కలెక్టర్ కి ప్రజావాణి ద్వారా విన్నవించు కున్నామని చెప్పారు. తమకు త్వరగా ఉపాధి కల్పించి, తగు న్యాయం చేయాలని ముస్త్యాల గ్రామవాసులు, నిరుద్యోగ భాదితులైన పిడుగు గట్టయ్య, మెరుగు రవి, జనగామ శంకర్, బెల్లంకొండ స్వామి, గోశిక లింగస్వామి, సిద్ధ కనకయ్య, సుంకరి సమ్మయ్య, పోతం రాయమల్లు, పోతం రవి, కొండ రాజేందర్ లు పత్రికా ముఖంగా వేడుకొన్నారు.
Post A Comment: