మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్*
భూపాలపల్లి*: జిల్లా కేంద్రంలో హాథ్ సే హాథ్ జోడోయాత్రలో భాగంగా ఈరోజు ఉదయం కేటీకే 5 ఇంక్లైన్ వద్ద ఐఎన్టియుసి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ ఏర్పాటు చేయగా, ఈ సందర్భంగా ఫ్లెక్సీల విషయంలో ఘర్షణ జరిగింది.మంగళవారం రోజు భూపాలపల్లిలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టారంటూ ఆరోపిస్తూ బిఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు.కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తల మధ్యన తోపులాట ఘర్షణ జరిగింది.పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించి అక్కడి నుంచి వెళ్లగొట్టారు.వారం రోజుల క్రితమే కేటీఆర్ సమావేశం జరిగినప్పటికీ ఫ్లెక్సీలను ఎందుకు తొలగించకుండా ఉంచారంటూ ఆవేశం వ్యక్తం చేశారు.భూపాలపల్లి లో యాత్ర కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టుకుంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు.
Post A Comment: