మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖనిలోని దుర్గా నగర్ బృందావన్ గార్డెన్ లో ఓబి కాంట్రాక్టు కార్మికుల సమ్మె సన్నాహక జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓబి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నేతలు కౌశిక్ హరి, బుర్ర తిరుపతి, వేల్పుల కుమారస్వామి, పూసాల తిరుపతి, ఏ వెంకన్న, తోకల రమేష్ హాజరై మాట్లాడారుఓబి యాజమాన్యాలు సమ్మె విచ్చిన్నానికి పాల్పడే విధంగా బెదిరింపులకు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయి. సమ్మె నోటీసు డిమాండ్ నోటీసులు ఇచ్చినప్పటికీ చర్చలు చెప్పకుండా అహంకారంతో వ్యవహరిస్తున్నాయి. కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీ లక్ష్యంగా ఓబి యాజమాన్యాలు ముందుకు సాగుతున్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క పైసా వేతనం పెంచకుండా లక్షల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె ఒకటే పరిష్కారంగా భావించి మార్చి 6 నుంచి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఓబి యాజమాన్యాలు సమ్మె ఇచ్చిందానికి పాల్పడితే తీవ్ర ప్రతిఘటన తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. మార్చి 6 తారీకు నుంచి జరిగే సమ్మెలో కార్మికులంతా ఐక్యంగా పాల్గొని ఓబి యాజమాన్యాలకు చెంపపెట్టుగా నిలవాలని సందర్భంగా పిలుపునిచ్చారు.
*ఈ కార్యక్రమంలో 300 మంది ఓబీ కాంట్రాక్ట్ కార్మికులతో పాటు జేఏసీ నాయకులు ఎంఏ గౌస్, శనగల శ్రీనివాస్, మహావాది రామన్న పాల్గొన్నారు
Post A Comment: