మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ- ఐ ఎఫ్ టి యూ ల ఆధ్వర్యంలో గోదావరిఖని ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో ఆర్ ఎఫ్ సి ఎల్ లోడింగ్ అన్లోడింగ్ కాంట్రాక్టు కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో *సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ ఉద్యగాల పేరు తో నిరుద్యోగ బాధితుల దగ్గర తీసుకున్న మొత్తం డబ్బులను తిరిగి దళారులు సబ్ కాంట్రాక్టర్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది.

అలాగే ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యం 119 మంది లోడింగ్ అన్లోడింగ్ కార్మికుల గేట్ పాసులు తొలగించడం జరిగింది.తిరిగి యాజమాన్యం వెంటనేగేట్ పాసులు ఇచ్చి లోడింగ్ అన్లోడింగ్ పనుల్లో పెట్టుకోని ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సౌకర్యాలు ఇతర చట్టబద్దమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. 

అలాగే మిగిలిన బాదితులకు ఇంక రావలసిన డబ్బులు సబ్ కాంట్రాక్టర్లు వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంగా సబ్ కాంట్రాక్టర్ల ను డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్,ఆర్ ఎఫ్ సి ఎల్ లోడింగ్ అన్ లోడింగ్ కార్మికులు బాసర వేణి రమేష్ ,ఐత శ్రావణ్, తిప్పని రాంకీ,నక్క మల్లేష్,  శివకుమార్, జక్కుల తిరుపతి, సురేష్,అర్కుటి కుమార్, మర్రి శ్రావన్,పూర్ణచందర్,కుమార స్వామి, మర్రి రాము. తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: