January 2023
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం లోని 22వ డివిజన్ లో  అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి గతంలో అభివృద్ధికి నోచుకోక రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ నిర్వీర్యం అయిందని, ఇప్పుడు  ఏన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని ప్రజలు కోరుకున్న ప్రతి పనిని ఎజెండాలో పొందు పరిచి నిధులు కేటాయించి సుపరిపాలన అందిస్తున్నామని బీజేపీ కార్పొరేటర్ మహిళా నాయకురాలు కౌశిక లత  అన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

యువత పుట్టిన రోజు అనగానే దావత్ అనడం , జరుపుకోవడం తరచుగా జరుగుతూనే ఉంటాయి. దానికి విభినంగా పేదలకి అన్నదానం, ఇతర సాయం చేస్తూ మిగిత యువతకి ఆదర్శనంగా నిలుస్తున్నాడు బూడిద హర్ష. గోదావరిఖని లో అర్ష ఫౌండేషన్ నెలకొల్పిన హర్ష ఇప్పటికే పలు సేవకార్యక్రమలు చేయడం జరిగింది. హెల్త్ కాంప్స్  నిర్వహించడం. డివిజన్ సమస్యల పైన పోరాడడం సమస్యల పరిస్కారానికి కృషి చేస్తూ యువతకి ఆదర్శంగా  నిలుస్తున్నాడు. అలాగే తన జన్మదినం సందర్బంగా 20 మంది నిరుపేదలకి బిర్యానీ ప్యాకెట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో హర్షతో పాటు మిత్రులు  పాల్గొన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్

సింగరేణి యాజమాన్యం ఓసిపి 5లో ప్రతిరోజు 3.30 నిమిషాలకు మోతాదుకు మించి భారీ బ్లాస్టింగ్లు చేస్తుండడంతో చుట్టూ ప్రాంత ప్రజలు ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని ఈ బ్లాస్టింగ్లతో ఇంట్లో సామాగ్రి కింద పడుతున్నాయని కాలనీవాసులు ఇళ్ల నుంచి బయటికి వచ్చి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్న పరిస్థితి దుమ్ము ధూళి ఆహార పదార్థాలపై నీటిపై పడటం వలన కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని డిసెంబర్ 23వ తేదీన డైరెక్టర్ ఆఫ్ జనరల్ మైనింగ్ సేఫ్టీ ధన్బాద్కు స్థానిక కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుకు స్పందించి డిజిఎంఎస్ డిప్యూటీ డైరెక్టర్లు కమలేశ్వర్ వర్మ సనత్ కుమార్ 1.2.2023 మధ్యాహ్నం 12 గంటలకు ఓసిపి5 కి వచ్చి పరిశీలించనున్నారు కావున ఇక్కడ ఉన్న ప్రజలందరూ నాయకులు వచ్చి  బ్లాస్టింగ్ వలన జరిగే నష్టాలను డీజీఎంఎస్ డైరెక్టర్లకు అధికారులకు తెలియజేయాలని కోరుతున్నామని పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ కోరారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

కరీంనగర్ లోని ఆదర్శ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గ్రామానికి చెందిన  గొండ్ర రాకేష్  ఉదయం యాక్సిడెంట్లో తీవ్ర గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగా  వారిని బీజేపీ రాష్ట్ర నాయకులు *సోమారపు అరుణ్ కుమార్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరడం జరిగింది.వారి వెంట బీజేపీ పార్టీ మండల  అధ్యక్షుడు పత్తి సంజీవ్ కుమార్, బీజేపీ నాయకులు అనురాగ్, గోండ్రా కుమార్, మరియు సర్పంచ్ స్వరూప రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్ 

మహాదేవపూర్/మేడారం: గుడి లేని దేవతలు, గిరిజనుల ఆరాధ్య దైవాలు, పల్లె ప్రజల ఇలవేల్పులు సమ్మక్క సారలక్కల మొక్కులు చెల్లించుకునేందుకు గ్రామ సీమల్లో సందడి మొదలైంది. చీరలు, సారెలు, పసుపు, కుంకుమలు, కొబ్బరికాయలు సమర్పించి, కోళ్లను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకునేందుకు గ్రామీణ ప్రజలు సమయాత్తమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమ్మక్క సారలక్కల పూనకాలతో భక్తుల సందడి మొదలవనున్నది.

బుధ, గురువారాలలో మొక్కులు తీర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

*మేడారం మినీ జాతర*

మేడారం మినీ జాతర ప్రారంభం కానున్నది. సమ్మక్క -  సారలమ్మ దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రానున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనున్నది. ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క సారలమ్మ మహా జాతర జరుగుతున్న విషయం తెలిసిందే,అదే రోజుల్లో మినీ మేడారం జాతర నిర్వహిస్తారు. మండ మెలిగే కార్యక్రమంతో ఈ జాతర ప్రారంభమవుతుంది. జాతరకు సుమారు ఐదు లక్షల మంది భక్తులు పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గిరిజనులు ప్రైవేట్ వాహనాలలో జాతరకు భారీ సంఖ్యలో తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

హన్మకొండ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న రాజీవ్ గాంధీ హన్మంతు ను నిజామాబాద్ కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ గా  సిక్తా పట్నాయక్ ను  ను నియమించారు.  ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం 15 మంది కలెక్టర్  లను  బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్

లింగాపూర్ గ్రామానికి చెందిన హర్షణ పెళ్లి వెంకటేష్ తండ్రి అర్షణ పెళ్లి బాలయ్య గత ఐదు సంవత్సరాల క్రితం మరణించగా బాలయ్య జ్ఞాపకార్థం వారి పెద్ద కొడుకు కోడలు అర్షన పెళ్లి సరిత వెంకటేష్ తబితాశ్రమంలోని అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా సరిత వెంకటేష్ దంపతులు మాట్లాడుతూ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని వెంకటేష్ వారి తల్లితో ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాధ పిల్లలకు అన్నదానం చేయడం ఎంతో తృప్తిగా ఉందని ఇకముందు ఎవరైనా ఇటువంటి కార్యక్రమం చేయాలనిఅనాధ పిల్లలతో కలిసి భోజనం చేస్తే ఆనందంగా ఉంటుందని ఆ పిల్లలకు కూడా ఆనందం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు వెంకటేష్ తల్లి కొడుకు విష్ణు వినయ్ స్వాతిశివ శ్రీనివాస్ ఇంకా తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

తాడిచర్ల ocp 1 ప్రాజెక్ట్ లోని A M R కంపెనీ ఎండి మహేశ్వర్ రెడ్డి  స్వయంగా గుడి నిర్మాణం చేపట్టి  కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను ఆహ్వానించగా తాడిచర్ల ఓసిపి 1 వద్దకు వెళ్లి గుళ్లను సందర్శించి A M R కంపెనీ ఎండి మహేశ్వర్ రెడ్డి దంపతులను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు తాళ్లపల్లి యుగంధర్, ఎండి  ఆసిఫ్ పాషా అనుమ సత్యనారాయణ, ఈదునూరి హరిప్రసాద్, సింగం కిరణ్ గౌడ్, తిరుపతి రెడ్డి, MD యాసీన్, గజ్జల నాగరాజు, అల్లి శంకర్ రాజ్, అష్రఫ్ ఖాన్, సాయి, అక్షయ్, సంతు, హర్షవర్ధన్, కరణ్, శ్రవణ్ కుమార్, రేశ్వంత్, సందీప్,.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ  ; 

వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ఆధ్వర్యంలో, జిల్లా న్యాయ సేవా సదన్ బిల్డింగ్, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం లో ఫిబ్రవరి 11న నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి, వరంగల్ జిల్లా ఇన్సూరెన్స్ అధికారులు, సంబంధిత న్యాయవాదులు, వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు వరంగల్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్  కె. రాధా దేవి మాట్లాడుతూ "జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల సూచనల మేరకు ఫిబ్రవరి  11న వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసుల పరిష్కారానికి ఇన్సూరెన్స్ అధికారులు, సంబంధిత న్యాయవాదులు, వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు సహకరించాలని తెలిపారు. రాజీ పడదగు కక్షిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారిని ఎటువంటి ఒత్తిడిలకు గురి చేయకుండా రాజీమార్గం ద్వారా వారి కేసును పరిష్కరించుకునేలా అందరూ సహాయపడాలని తెలియజేశారు. లోక్ అదాలత్ పట్ల ఎటువంటి న్యాయ సలహా సూచనల కొరకు అయిననూ న్యాయ సేవాధికార సంస్థలను ఆశ్రయించి, న్యాయ సలహాలు, సూచనలను పొందగలరని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, కార్యదర్శి జె.ఉపేందర్ రావు,  ఇన్సూరెన్స్ స్టాండింగ్ కౌన్సిల్స్ టి.రవీందర్ రావు, సి.హెచ్.లింగమూర్తి, కె.లక్ష్మారెడ్డి, బి.రమేష్ గౌడ్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్, లీగల్ ఏయిడ్ న్యాయవాదులు సమావేశానికి హాజరయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వరంగల్ జర్నలిస్టుల కోసం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం ఎంజీఎం ఎదురుగా ఉన్న ఐ.ఎం.ఏ హాల్లో నిర్వహించారు. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వరంగల్ జర్నలిస్టుల కుటుంబాలకు ప్రత్యేక వైద్య బృందంతో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరం అయిన వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ కంటి వెలుగు శిబిరాన్ని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జర్నలిస్టు కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, ఉపాధ్యక్షుడు యాంసాని శ్రీనివాస్, అల్లం రాజేష్ వర్మ, సహాయ కార్యదర్శులు పెద్దపెల్లి వరప్రసాద్, విష్ణువర్ధన్, బూర్ల నరేందర్, కార్యవర్గ సభ్యులు దొమ్మాటి శ్రీకాంత్, ఎం.డి నయీమ్ పాష, కమటం వేణుగోపాల్, విజయ్ రాజు, డీపీఆర్ఓ బండి పల్లవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటరమణ, ఐ.ఎం.ఏ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్, టీయూడబ్ల్యుజే 143 జిల్లా అధ్యక్షుడు మెండు రవీందర్,  ఐజేయూ(టి.యూ.డబ్ల్యూ.జే) గాడి పెళ్లి మధు, జిల్లా అధ్యక్షుడు రాంచందర్, ప్రధానకార్యదర్శి మట్ట దుర్గప్రసాద్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఆడేపు సాగర్, వరంగల్ తూర్పు జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మెరుగు రాజేంద్ర ప్రసాద్, తూర్పు సీనియర్ జర్నలిస్టులు సంగోజి రవి, బండి రవి, పూర్ణ, వాయిద్ గుల్షన్, ఎస్ఎం సయ్యద్, జున్ను స్వామి , శ్యామ్ , వెంకన్న, చిన్న బాబు, సదాశివుడు, నరేష్, వనం భాస్కర్, ఆడెపు మహేష్, హరి, రాజేష్, సంతోష్, పాపాని భాస్కర్, అమీర్, పుప్పాల అనిల్, నితీష్, శ్యామ్, నాగపురి నాగరాజు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

హనుమకొండ జిల్లా, కమలాపురం మండలం గూడూరు గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం చేరుకున్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగర పోలీస్ కమిషనర్ కె.రంగనాథ్ తదితరులు  ఘన స్వాగతం పలికారు.

కమలాపురం మండల కేంద్రంలో  43.5 కోట్లతో నిర్మించిన మహాత్మ జ్యోతిరావు పూలే బాలికలు, బారుల విద్యాలయం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలను, కోటి 50 లక్షలతో  జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కోటి 71 లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, 25 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్, 25 లక్షలతో అయ్యప్ప గుడి, 30 లక్షలతో పెద్దమ్మ గుడి, లక్షలతో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్, 30 లక్షలతో మార్కండేయ ఆలయం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో శంకుస్థాపనలు చేసి  రైతు వేదిక ప్రాంగణంలో 69 లక్షల 85 వేల తో నిర్మించిన వివిధ కుల సంఘాల భవనాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం చదువుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యాసంస్కరణలు చేస్తుందని అన్నారు. విద్య వైద్యం రైతు సంక్షేమం తదితర అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలుపరచడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందని రాష్ట్ర పురోగతిని చూసి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వారి రాష్ట్రంలో ఇలాంటి పథకాలు అమలు చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని తారకరామారావు అన్నారు.

అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే బాలబాలికల రెసిడెన్షియల్ విద్యార్థినీ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో ముచ్చటించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుపరచుందని పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను కొనసాగించేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశపెట్టిన విద్య వైద్యం రైతు సంక్షేమం కుల సంఘాల అభివృద్ధి అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన గౌరవం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఛైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ లు, పాడి కౌషిక్ రెడ్డి, ఎమ్మేల్యే లు ఒడితల సతీష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుదీర్ కుమార్, డాక్టర్ తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ప్రజా ప్రతినిధులు స్థానిక సర్పంచ్ ఎంపీపీ జడ్పిటిసి అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

లింగాపూర్ గ్రామంలో నడుస్తున్న ఉపాధిహామీ పథకం లో భాగంగా వేసవికాలంలో గుట్టపైన చేపట్టడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఎండ దెబ్బ తగిలి చాలా మంది తరుచు అస్వస్థతకు గురై ప్రమాదాల బారిన పడుతున్నారు అని కావున ఈ సమయంలో గుట్టపై చేపట్టి ఎండాకాలంలో చెరువులు కుంటల్లో కాల్వల్లో సాధారణ పనులు చేపట్టాలని ఎంపిడివో ను కోరడం జరిగింది.దీనికి ఎంపిడివో భూక్య యాదగిరి సానూకూలంగా స్పందించారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్  ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ లో చేరిన బి ఆర్ స్ (తెరాస ), కాంగ్రెస్ పార్టీ కి చెందిన వార్డ్ మెంబెర్స్, కన్నాల లారీ అసోసియేషన్ అధ్యక్షులు, తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా కన్వినర్ పలువురు సీనియర్ నాయకులు...

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం(మంథని నియోజకవర్గం )కన్నాల, జీడి నగర్  గ్రామాలలో నుండి బి ఆర్ స్,(తెరాస )పార్టీ నుండి పలువురు వార్డ్ సభ్యులు ,లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్, గండికోట రజిత - బొబ్బిలి రాజ్,బుర్ర సది గౌడ్, గౌరీ మోహన్,తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా కన్వినర్ పిసార్ల లక్షణ్ రావ్,యువ నాయకులు మాచర్ల సంతోష్, లారీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బండి రవి ,సీనియర్ నాయకులు వంగల సంతోష్ రెడ్డి,కొండా పాల్కలా రాజశేఖర్, మడిపెల్లి సంజీవ్, చిందం పవన్ కుమార్, ఉష్కామల్ల విష్ణు, చిందం శ్రీనివాస్, లక్కకుల శ్రీకాంత్, సుర అశోక్, కోమిరే ఐలయ్య, పల్లెపు వెంకటేష్, మల్కాసురేందర్,మోటం రవి తో పాటు 30 మంది నాయకులు బీజేపీ పార్టీ లో చేరారు వీరికి సునీల్  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

 మహాత్మా గాంధీజీ అమరత్వం జనవరి 30 వర్ధంతి సందర్భంగా  రామగుండం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పుట్ట రాజన్న  ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  జైహో హిందూ-ముస్లిం ఐక్యత కోసం "జై భారత్ "ఆధ్వర్యంలో దేశ స్వతంత్ర పోరాట వీరులను స్మరించుకుంటూ నవభారత నిర్మాణం కొరకు,రండి కదలిరండి అని పిలుపునిచ్చారు. అషాప్ ఖ్ బిస్మిల్, ఉద్ధమ్ సింగ్, వివేకానంద నేతాజీ గాంధీజీ గఫార్ ఖాన్ లాంటి మహనీయులు చూపిన బాటలో నడుద్దాం మతోన్మాదాన్ని నిర్మూలిద్దాం, నవీన భారత్ ను నిర్మిద్దాం అంటూ జై భారత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ నుండి,జనవరి లాస్ట్ వరకు, ప్రతి సంవత్సరం "జై భారత్ "ఆధ్వర్యంలో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నామని,ఇందులో భాగంగా, హిందూ_ ముస్లిం సమైక్యత సభ  పెద్దపల్లి జిల్లా, రామగుండం ప్రెస్ క్లబ్ లో  సమావేశం ఏర్పాటు చేసి  వివిధ సంఘాలు,యూనియన్లు,రాజకీయ నాయకులు,ప్రెస్ మిత్రులు వక్తలుగా పాల్గొని మాట్లాడారు,జై భారత్ వ్యవస్థాపకులు రమణమూర్తి,ఆధ్వర్యంలో  ,విజయ విహారం పత్రిక ,ద్వారా దేశంలో మతసామరస్యం కోసం జై భారత్ సంస్థ అలుపెరుగని కృషి చేస్తుందని పేర్కొన్నారు,ముందుగా పర్యావరణ,పరిరక్షణ గూర్చి చర్చించారు,ఈ కార్యక్రమంలో  షేక్ జమీల్ హుస్సేన్ ,కొండ్ర అంజయ్య, పరకాల లక్ష్మణ్, గంగారపు వెంకటేష్ ,కండె రవీందర్, సతీష్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఏజెన్సీ దళితుల సమస్యలు పరిష్కరించండి

12 లక్షల మంది దళితులకు ప్రత్యామ్నాయం చూపండి

పుట్టిన భూమి హక్కు లేదు, రాజకీయ రిజర్వేషన్ లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు

75 సంవత్సరాల స్వతంత్రంలో ఏజెన్సీ దళితులకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు

ఏజెన్సీ దళితుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయండి

సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ఈ మేరకు ఆయన కరీంనగర్ శ్రీపురం లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో  మంత్రి కొప్పులను కలిసి  పలు ఏజెన్సీ దళితుల సమస్యలు వివరించారు.  రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏజెన్సీ దళితులకు వర్తించడం లేదని ఆవేదన చెందారు తాతలతండ్రుల కాలం నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న దళితులకు , పుట్టిన భూమిపై హక్కులు లేక రాజకీయ రిజర్వేషన్  లేక చదువుకున్న విద్యార్థులకు స్థానిక ఉద్యోగాల్లో అవకాశం లేక ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు . సాగు భూములకు, పోడు భూములకు హక్కు హక్కు పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వాలు ప్రవేశపెట్టే రైతు బీమా రైతుబంధు బ్యాంకు రుణాలు సబ్సిడీ విత్తనాలు మొదలైన సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు, రాజకీయం ఎదగాలన్న కనీసం సర్పంచ్ అయ్యే అవకాశం కూడా లేదన్నారు. విద్యార్థులకు డిగ్రీలు పేజీలు చదివిన జీవో 3 తో స్థానిక ఉద్యోగ నియమాకాల్లో అవకాశాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారన్నారు. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఏజెన్సీ దళితులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఏ రంగంలో చూసిన  అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన చెందారు..ఏజెన్సీ దళితుల అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి  కొంత బడ్జెట్  కేటాయించాలని, దళిత వాడలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని.ఏజెన్సీ దళితులను ఏజెన్సీ వాసులకు గుర్తించి ఎస్టీలతోపాటు సమాన హక్కులు కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు జీవో త్రీ రద్దు తీర్పును పకడ్బందీగా అమలు చేస్తూ ఏజెన్సీ ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. అందుకు సానుకూలంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 పలిమల మండల ప్రతినిధి / తాటికొండ కేశవ చారి

ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనం స్మశానవాటికల లో నాసిరకం పనులు మారుమూల గ్రామం కావడంతో పట్టించుకోని అధికారులు
మహాదేవపూర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమల మండలం లెంకలగడ్డ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన గ్రామం పల్లె ప్రకృతి స్మశాన వాటికలో తూతూ మంత్రంగా పనులు నిర్వహించి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని తమ ఇష్టానుసారంగా పనులు నిర్వహించి కాంట్రాక్టర్ లు సొమ్ములు జమ చేసుకున్నారని ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి ఊరు ఊర రైతు లకు సంబందించిన ఎరువుల తయారీ షెడ్డు ను ఒక పటిష్టమైన పద్ధతి లో నిర్మించే కార్యక్రమంచేసి నిధులు విడుదల చేస్తే ఇలా నాసిరకం పనులు చేసి ప్రజాధనంము ను వృధా చేస్తున్నారు. అలాగే హరిత హారం లో భాగంగా చెట్టులు పెంచే కార్యక్రమం చేస్తే మా ఊరులో ఇలా నాశనం చేస్తున్నారు...! 

ఇలా వుంది మా పరిస్థితి ఈ మారుమూల ప్రాంతం లో అడిగే వారు వుండరు అని మాకు నచ్చినట్టు మేము కడుతాము మమ్మల్ని అడిగే వారు

లేరు నాకు వచ్చింది కాంట్రాక్టు నాకు నచ్చి నట్టు కడుతా అనే రీతిలో వున్నట్టు వుంది. మార్మూల గ్రామం కావడంతో అధికారి పట్టించుకోవడం లేదని అధికారులకు అడపాదడప మామూలు అందిస్తున్నారని ప్రజలలో గుసగుసలు వినబడుతున్నాయి హరితహారం కింద చెట్లను పెంచాల్సిన చెట్లను పెంచకుండా తమ ఇష్టానుసారంగా పడవేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని షెడ్డు పని చేసే కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి ఇలా గ్రామంలో జరిగే అనేక అభివృద్ధి పనులపై నాసిరకం పనులు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అని స్థానిక బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు నిరంజన్ మరియు ప్రజలు పత్రిక ముఖంగా అధికారులను కోరుకుంటూన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

లైబ్రరీ చైర్మన్ కు భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ పుస్తకం బహుకరణ

ప్రతి లైబ్రరీలో భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ  పుస్తకాలను ఉంచేలా చూడాలని 

 పెద్దపల్లి జిల్లా లైబ్రరీ చైర్మన్ రఘువీర్ సింగ్ ని  సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన లైబ్రరీ చైర్మన్ రఘువీర్ సింగ్ కి భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ పుస్తకాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా మార్షల్ నగేష్  మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్నింటి కన్నా ఉన్నతమైందని, దీని రూప కల్పనలో ముఖ్యపాత్ర పోషించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మహానుభావుడు చిరస్మరణీయులన్నారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 నుండి 51 వరకు  గల ఆర్టికల్స్ ను  విశేషణాత్మకంగా వివరిస్తూ  సులువుగా ఆర్డమయ్యే విధంగా భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ పుస్తకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. జిల్లాల్లో అన్నీ లైబ్రరీ కేంద్రాల్లో భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ  పుస్తకాలను అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. వెంటనే రఘువీర్ స్పందించి తప్పకుండా ఉంచుతామని తెలిపారు. ఇంకా ఆయన వెంట ఎస్సీ ఎస్టీ వర్కింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కట్కూరి మల్లేష్ తదితరులు ఉన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

మంచిర్యాల పర్యటన లో భాగంగా రామగుండం నియోజకవర్గం విచ్చేసిన మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి బిజెపి నాయకులు, Ex MLA, TSRTC చైర్మెన్ సోమారపు సత్యనారాయణ  గృహం లో మర్యాదపూర్వకం గా వచ్చి కలిసి రాబోయే ఎలక్షన్స్ లో పార్టీ కార్యాచరణ పై చర్చించడం జరిగింది ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్  బిజెపి సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక,5inc లైన్ మండలం అధ్యక్షులు డేవిడ్, దాసరికిషోర్,వెంకటేష్,యశ్వంత్,రాజు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

BRS పార్టీ ప్రెస్ మీట్ లో MLC పాడి కౌశిక రెడ్డి  తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి సౌందర్యరాజన్  గురించి అసభ్యకరం గా మాట్లాడుతూ తీవ్రమైన అసభ్య పదజాలం తో దూశించి గవర్నర్ ను అవమానించి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడారు వారి మాటల వలన మహిళల మనోభావాలు దెబ్బ తినడం జరిగింది కావున గవర్నర్ ను అసభ్య పదజాలం తో దుశించినందుకు కౌశిక రెడ్డి పై తగిన చర్యలు చేపట్టాలని వెంటనే బర్తరఫ్ చేయాలి అని రామగుండం మహిళ మోర్చా తరపున  డిమాండ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంతేకాక అతను ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని తెలిపారు 

ఈకార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక,మల్కాపూర్ మండలం జనరల్ సెక్రటరీ గాండ్ల స్వరూప, బిజెపి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం కార్పొరేషన్ పరది 23 వ డివిజన్ సుభాష్ నగర్ కు చెందిన ఠాగూర్ సునిత అనే యువతి ఇటీవల మృతి చెందగా  యువతి మూడవ దినకర్మ కార్యక్రమం సుభాష్ నగర్ లోని సునీత గృహంలో నిర్వహింస్తుండగా సేవ స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ ను సహాయం కోరగా  మృతి చెందిన సునీత కుటుంబానికి పీకే రామయ్యా కాలని యూత్ నాయకులు సంజీప్ ప్రసాద్ ద్వారా 25 కిలోల బియ్యం అందజేశారు అనంతరం సంజీప్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు అనునిత్యం సేవా స్పూర్తి ఫౌండేషన్ ద్వారా అనేక

సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదప్రజల మన్ననలు పొందుతున్న ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు మరియు ఫౌండేషన్ సభ్యులకు  23 వ వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సంజిప్ అన్నారు కార్పొరేషన్ లో ఏ నిరుపేద చనిపోయిన మడిపెల్లి మల్లేష్ అన్న కు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే చాలు మరణించిన వారికి పాడే కు సంబంధించిన వస్తువులు మరియు బియ్యం ఫౌండేషన్ తరపున సహాయం అందిస్తున్నారని అలాగే రామగుండం నియోజకవర్గంలో ఎవరు సహాయం అడిగిన కూడా కాదు లేదు అనకుండా తన వంతు సహకారం అందిస్తూన్నా వారి దాతృత్వానికి మరొక్కసారి రామగుండం నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సంజిప్ అన్నారు ఈ కార్యక్రమంలో. రాంప్రసాద్. ధనంజయ్. హేమంత్.మణికంఠ సూరజ్  తదితరులు పాల్గొన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వరంగల్ లోని హెల్త్ సిటీ నిర్మాణ పనులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శనివారం పరిశీలించారు. అనంతరం 

మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్ సిటీ నిర్మాణం పరిశీలించాము. 

వరంగల్ తో పాటు, ఉత్తర తెలంగాణ ప్రజల కోసం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్  2000 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టారు.

నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి.

2023 చివరి నాటికి భవనం పూర్తి అవుతుంది అన్నారు. దసరా నాటికే పూర్తి అయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి, ఏజెన్సీ, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించాము. 

రాత్రి పగలు కష్టపడాలి అని ఆదేశాలు ఇచ్చాం. మొత్తం 16 న్నర లక్షల ఎస్ ఎఫ్ టి లో  24 అంతస్తుల నిర్మాణం జరుగుతున్నది.

వరంగల్ హెల్త్ సిటీ చారిత్రాత్మక భవనం

రాష్ట్రానికే కాదు దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు ఇక్కడ అందబోతున్నాయి.

216ఎకరాల్లో ఈహెల్త్ సిటీ రూపుదిద్దుకుంటోంది.

అవయవమార్పిడి ఆపరేషన్లు కూడా వరంగల్ లో అందుబాటులోకి రాబోతాయి.హైదరాబాద్ తర్వాత వరంగల్ ను అంతగా అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారు.

రాజకీయాల కోసం కొందరు విమర్శలు చేస్తారు.

గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా విమర్శలు చేశారు.విమర్శలు చేసినోళ్లే ఇవాళ నోరెళ్లబెడుతున్నాయి.

కాంగ్రెస్ హయాంలో నేను రానుబిడ్డో సర్కారు దవాఖనకు అనే వారు. ఇప్పుడు నేను పోత బిడ్డో సర్కార్ దవాఖనకు అంటుతున్నారు.

ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. పీజీ సీట్లలో రెండో స్థానంలో ఉంది.

మెడికల్ చదువు కోసం మన పిల్లలు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కృషి చేస్తున్నాం.

సమైక్య రాష్ట్రంలో మెడికల్ విద్యలో వెనకబడ్డాం.

తెలంగాణలో మంచి పథకాలు అమలు చేస్తున్నారని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు చెబుతున్నారు.

ఢిల్లీలో, పంజాబ్ లో కంటి వెలుగు ప్రారంభిస్తామని ప్రకటించారు.

కంటి వెలుగుకు బారీ స్పందన వస్తోంది.ప్రభుత్వ ఆసుపత్రుల వద్దకు ప్రజలు కాదు, ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లి పరీక్షలు చేస్తున్నది. కేంద్రం ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోంది.

కాళేశ్వరం స్ఫూర్తితో వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తాం.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు కూడా ఇలాగే అన్నారు. అవుతుందా అని. నీళ్ళు వచ్చి వరంగల్ లో రెండు పంటలు పండుతున్నాయి.

యాసంగిలో రెండు పంటలు పండుతున్నాయి అంటే కాళేశ్వరం కారణం.

వరంగల్ నగరానికే కాదు జాతీయ స్థాయిలో అద్భుతమైన అవసరాలు తీర్చే ఆసుపత్రి.

దేశానికే ఒక మోడల్ కానున్నది.పేద ప్రజలకు కార్పొరేట్ వసతులు కలుగుతాయి.

వరంగల్ లో హెల్త్ యూనివర్సటీ, వెటర్నిటీ యునివర్సటీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆలోచించారు. మూడు షిఫ్టుల్లో పనులు చేసి, నాణ్యత ప్రమాణాలు పూర్తి స్థాయిలో పాటించి యుద్ద ప్రాతిపదికన భవనం పూర్తి చేయాలి. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం. 

926 మంది డాక్టర్లు నియామకం చేశాం.

12,13 వందల ప్రొఫెసర్ పోస్టుల రిక్రూట్ చేస్తున్నాం.

కేంద్రం సహకారం ఇవ్వడం లేదు. వివక్ష పూరిత వైఖరితో 157 కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి  ఇవ్వలేదు. రాష్ట్ర సొంత నిధులతో సీఎం  8 మెడికల్ కాలేజీలు కట్టారు. జిల్లాకు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు.

సీఎం  స్వయంగా హెల్త్ సిటీ పనులు సమీక్ష చేస్తున్నారు. ఎలాంటి నిధుల కొరత లేదు. 

వినయ్ భాస్కర్ మాట్లాడుతూ 

వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాలు కడుతుంటే విమర్శిస్తున్నారు.

పేద వాళ్లు పెద్ద భవనాల్లో చదువుకోవద్దా...? పెద్ద భవనాల్లో చదువుకోవద్దా..?

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని, క్రీడల్లో పాల్గొనడం ముఖ్యమని, ఆటల్లో ఓటములు సహజమని, ఓటమి నుంచి విజయం వరించే వరకు శ్రమిoచాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం అంబేద్కర్ స్టేడియంలోని సింగరేణి మినీ ఫంక్షన్ హాల్ లో భూపాలపల్లి బ్యాడ్మింటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఓపెన్ షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలను ఎస్పీ ప్రారంభించారు. ఆ తర్వాత క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు వారితో కలిసి షటిల్ అడారు. ఈ క్రీడల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 80 టీమ్ పాల్గొంటున్నాయి. రెండు రోజుల పాటు ఈ ఆటలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఎస్పి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడతాయని, క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. యువత క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని క్రీడలతో మానసికంగా దృఢంగా తయారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సిఐ రాజిరెడ్డి, డాక్టర్లు కె.ఎస్ కిరణ్, కే శ్రీనివాస్, ప్రధాన్ భరత్ రెడ్డి భూపాలపల్లి ఎస్సై ప్రశాంత్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

జిల్లాలో టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ పూర్తి ఆన్ లైన్ లో నిర్వహించాలని, ఇందు కోసం జిల్లాలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని  కలెక్టర్ లకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన,  రాష్ట్ర విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి తో కలిసి టీచర్ల బదిలీ పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు మనబడి మోడల్ పాఠశాలలు అంశాల పై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, అవినితికి తావు లేకుండా ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ లో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీలు లేదని, ప్రభుత్వ మార్గదర్శకాల పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు సినియార్టి జాబితా, ఖాళీల జాబితా ఆన్ లైన్ లో ప్రదర్శించాలని, వాటిలో అభ్యంతరాలను ఉపాధ్యాయుల నుంచి స్వీకరించాలని తెలిపారు.

జిల్లాలో ఉపాధ్యాయులు కోసం తాత్కాలికంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.  మన ఊరు మన బడి కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడంలో కలెక్టర్ లు కీలక పాత్ర పోషించారని, మోడల్ పాఠశాలలను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా కలెక్టర్ లు తమ జిల్లా పరిధిలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు పనులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. 

రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి  ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరిగేలా కలెక్టర్ లు పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్దం చేయాలని, 2 రోజుల్లో జిల్లాలకు ఫర్నీచర్ వస్తాయని, సదరు ఫర్నీచర్ ను ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న పాఠశాలలకు తరలించాలని సూచించారు.

మన ఊరు మనబడి కింద అన్ని రకాల పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రారంభోత్సవం నిర్వహించాలని, ఏ చిన్న పోరపాటు జరిగినా  అనవసరపు అపనిందలు పడాల్సి వస్తుందని, అధికారులు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

హనుమకొండ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ  జిల్లాలో మొత్తం 14 మండలాలలో 28 స్కూల్స్ ను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎంపిక చేసిన 22 మోడల్ మన ఊరు- మన బడి పాఠశాలలో 14 పాఠశాల పనులు సంపూర్ణంగా పూర్తి చేసామని, 8 పాఠశాలలో పెయింటింగ్ వర్క్ పెండింగ్లో ఉందని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. పూర్తిస్థాయిలో పనులు ఫిబ్రవరి 10 నాటికి పూర్తవుతాయని, మిగిలిన పాఠశాలలో నరేగా పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. 

జిల్లాలో టీచర్ల బదిలీలు పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితాను సమర్పించామని, ఖాళీల జాబితా మరో గంట సమయంలో సమర్పిస్తామని  కలెక్టర్ తెలిపారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో , జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై, తదితర విద్యాశాఖ అధికారులు  పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

"రామగుండం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా రాజిరెడ్డి నియమితులయ్యారు.   రామగుండం ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు... కోరుకంటి.చందర్  నియమిస్తున్నట్లు ప్రకటించారు..*అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి సైనికుడి లా పనిచేయడంతో పాటు . ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో చేరువయ్యల కృషి చేస్తాను  నాపై నమ్మకం ఉంచి అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఎమ్మెల్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి.చందర్  డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

స్థానిక రామగుండం రైల్వే స్టేషన్ 20th వార్డ్ లో మురికి నీరు డ్రైనేజ్ వాటర్ సరైన మెయింటనెన్స్ లేక మెయిన్ రోడ్డు మీద మురుగు నీరు ప్రవహించి రైల్వే ప్రయాణికులకు తీవ్రమైన దుర్గంధం స్వాగతం పలుకుతుంది అంతే కాకుండా స్థానిక ప్రజానీకం చెడు వాసన వెదజల్లడంతో తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారు కాబట్టి తక్షణమే మున్సిపల్ కమిషనర్ అలాగే మేయర్ స్థానిక కార్పొరేటర్ సమన్వయంతో మున్సిపల్ సిబ్బంది ద్వారా మెయిన్ రోడ్డు పై ప్రవహిస్తున్న ఈ మురుగు నీటి ప్రవాహాన్ని ఆపేయాలని అలాగే మురుగు నీటి పారుదల నాలాలలో పేరుకు పోయిన చెత్త చేదారాన్ని వెంటనే సాఫ్ చేయాలనీ రామగుండము నియోజక వర్గం ఇంచార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ డిమాండ్ చేశారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు తో కలిసి 8 కోట్ల 65 లక్షల విలువగల రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత  శంకుస్థాపన చేసిన వాటిలో హమాలివాడలోని వినాయక గుడి నుండి గాంధీనగర్ వరకు రోడ్డు అభివృద్ధి పనులకు టి.యు.ఎఫ్.ఐ.డి.సి నిధులు నుండి రెండు కోట్ల ఎనబై లక్షల రూపాయలతో శంకుస్థాపన*మరియు హమాలివాడలోని *భాగ్యలక్ష్మి చికెన్ సెంటర్ నుండి తిలక్ నగర్ వరకు రోడ్డు అభివృద్ధి పనులకు టి.యు.ఎఫ్.ఐ.డి.సి నిధులనుండి 5 కోట్ల 85 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ నాయకులు విజిత్ రావు  మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్  మున్సిపల్ కమిషనర్  మరియు వార్డు కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మహిళా నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రైతుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్

  రామగుండం ఓసీపీ 4 ప్రభావిత ప్రాంత రైతులైన రామగుండం పాముల పేట లింగాపూర్ గ్రామాల పరిధి లోని భూములను గతంలో సింగరేణి కి త్యాగం చేసి ఉపాదిని కోల్పోయి ఎటువంటి పునరావాసం కల్పించకున్న రైతులు సర్వస్వము కోల్పోయి వారి మిగులు భూములు కూడా దున్నుకోనీయకుండా వ్యవసాయం సాగు చేసుకోనీయకుండా సింగరేణి వారు ఖనీలు పాతుతుంటే మేమేలాగయ్య వ్యవసాయం చేసేది అని వారి ఆవేదనను మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ కు విన్నవించుకున్న మరుక్షణమే మీకోసం నేనున్నా అని సిoగరేణి GM తో మాట్లాడి పూర్తిగా రైతులు మీకే వారి భూములను అప్పగించారు మిగిలిన భూమిలో కూడా మీరు ఖనీలు పాతుతుంటే వారేలా బ్రతికేది అని మీరు రైతులతో సమన్వయంతో ముందుకెళ్లాలని రైతుల భూములను వారికే అప్పగించాలని తెలియజేయడం జరిగింది లేని పక్షంలో నేను రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సి వస్తుందని పరిస్థితి అంతవరకూ రానివ్వొద్దని కాంగ్రెస్ పార్టీ రామగుండము నియోజక వర్గం ఇంచార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ సింగరేణి gm తో మాట్లాడటం జరిగింది..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గోదావరిఖని,  పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ శివాజీ నగర్ కు చెందిన పెద్దెల్లి సునీత అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్ లోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం చేరింది . పేషంట్ కి. 3 % మాత్రమే బ్లడ్ ఉందని వెంటనే బ్లడ్ ఎక్కించాలని అందుకు ఓ నెగటివ్ రక్తం నాలుగు యూనిట్లు అవసరం ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో వారి బంధువులు సమత ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ ను నాలుగు యూనిట్ల రక్తం సమకూర్చాలని వేడుకున్నారు. నగేష్ వెంటనే స్పందించి తమ సమత ఫౌండేషన్ సభ్యులకు సమాచారమందించి, 4ప్యాకెట్ల ఏ పాజిటివ్ రక్తాన్ని సమకూర్చారు. దీంతో వారి బంధువులు  పెద్దెల్లి రామస్వామి సమత ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నగేష్ కు, రక్తదానం చేసిన జాడి మారుతి, ఉయ్యాల వినోద్ కుమార్, రతన్ లకు  ధన్యవాదాలు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

 రైల్వే కాంట్రాక్టు వర్కర్స్ సమస్యల గురించి క్యాబిన్ రిపేర్ గ్యారెజ్ రామగుండము రైల్వే స్టేషన్ లో కాంట్రాక్టు వర్కర్స్ తో వారి సమస్యల గురించి మాట్లాడటం జరిగింది, 

 కాంట్రాక్టు వర్కర్స్ దాదాపు 1000 మంది వరకు ఎన్నో ఏళ్లుగా దీన్నే నమ్ముకుని వర్క్ చేస్తున్నాము. అయితే మాకు ఇంత వరకు pay స్కేల్ కానీ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ Esi కార్డ్స్ కానీ కనీస సౌకర్యాలు లేక కనీసం మమ్మల్ని స్కిల్డ్ వర్కర్స్ గా అయినా గుర్తించ కుండా శ్రమదోపిడికి గురి చేస్తూ మాతో వెట్టి చాకిరీ చేయించు కుంటున్నారు అలాగే మేము చేస్తున్న వర్క్ కి నాలుగు ఐదు నెలలైన సరైన టైం కి జీతాలు ఇవ్వకుండా మేము పని చేసి ఎందుకు అని ఆవేదన వ్యక్తం చేయడంతో రాజ్ ఠాగూర్  కాంట్రాక్టు వర్కర్స్ సమస్యల పట్ల స్పంధిoచి మీకు అండగా నేనుంటా మీ కాoట్రాక్టర్స్ తో  నేను మాట్లాడి మీకు సరైన టైం లో అనగా జీవో ప్రకారంగా నెల నెల జీతాలు అందేలా మాట్లాడుతానని హామీ ఇచ్చారు అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులర్ కార్మికులను తగ్గించుకుంటూ కాంట్రాక్టు కార్మికులను రిక్రూట్ చేసుకుని ఈ రకంగా వ్యవహరించడం సహించరాని చర్య కాబట్టి కాంట్రాక్టు కార్మికుల సమస్యల సాధన కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం రాబోయే రోజుల్లో మీకోసం మీ సమస్యల పట్ల నేను పోరాడతాను అనిభరోసా కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రామగుండము నియోజక వర్గ ఇంచార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్  ఈ కార్యక్రమం లో ముఖ్య నాయకులు తాజ్ భాయ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు జగన్ మోహన్ రావు,టౌన్ ప్రెసిడెంట్ ఈదునూరి ప్రసాద్, మైనార్టీ అధ్యక్షులు గౌస్ బాబా, డివిజన్ అధ్యక్షులు సిరిశెట్టి సతీష్, కోఆర్డినేటర్ చాంద్ భాయ్ పల్లి కొండ రాజేష్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

74వ గణతంత్ర  దినోత్సవాన్ని పెద్దంపేట గ్రామస్తులు  ఘనంగా నిర్వహించారు పెద్దంపేట గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్టా శ్రీనివాస్ అధ్యక్షతన పెద్దంపేట్ & రాయదండి గ్రామాల ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు

ఈ కార్యక్రమంలో

ఎంపీటీసి కోలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పుట్టా శ్రీనివాస్ యాదవ్, అంతర్గం మండల్ అధికార ప్రతినిధి ఆముల సరన్, కరివెద శ్రీనివాస్ రెడ్డి, బండి అశోక్ గౌడ్, మాజీ సర్పంచ్ ఆముల శ్రీనివాస్, ఆముల పెద్ద శ్రీనివాస్, దాడి బాలు, యూత్ వైస్ ప్రెసిడెంట్ బీరెల్లి సరన్, యూత్ ప్రధాన కార్యదర్శి సాయి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోల స్వామి, మాటిటి రవి, నేరెళ్ల సత్యం గౌడ్, గౌడ సంఘం ప్రెసిడెంట్ మెరుగు రమేష్ గౌడ్, కన్న తిరుపతి గౌడ్, గుర్రం యాదగిరి గౌడ్, పొన్నగంటి మల్లేష్, గోలి సంజీవ్, మెరుగు శ్రీనివాస్ గౌడ్, తమ్మనవేణి రమేష్, పల్లె రాజయ్య, అడేపు లక్ష్మణ్, మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ

హన్మకొండ ;

మెట్టు దర్వాజ ప్రాంతంలో ఖిలా వరంగల్ డప్పు కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ 

ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ

రాజ్యాంగ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు మనమంతా కృషి చేయాలన్నారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్క‌ర్‌ స్ఫూర్తి అజరామ‌ర‌మ‌ని ఎమ్మెల్యే కొనియాడారు. అటువంటి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్  పాలన యావత్ భారతదేశానికే ఒక రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పోశాల పద్మ స్వామి, బైరబోయిన ఉమాదామోదర్, ఖిలా వరంగల్ డప్పు కళాకారులు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

18వ డివిజన్ చెన్నారెడ్డి కాలనిలో ఏర్పాటు చేసిన భారతరత్న డా.బిఆర్ అంబెడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కొరబోయిన విజయ్ కు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.  

డప్పు చప్పులతో, డిజెలతో మహిళలు, యువకులు  నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు

అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు స్థలికి చేరుకున్న ఎమ్మెల్యేకు మహిళలు పూలు చల్లి సాదరంగా ఆహ్వానం తెలిపారు.

తదనంతరం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్  జై భీమ్ నినాదాల మధ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ

అంబెడ్కర్  కలలు కన్న సమానత్వం, సామాజిక న్యాయాన్ని పేదప్రజల అభివృద్దే ధ్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

ఆనాడు  అంబేడ్కర్  రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్లనే మనం  కేసిఆర్  ఆధ్వర్యంలో తెలంగాణ నూతన రాష్ట్రాన్ని ఏర్పరుచుకున్నమని గుర్తు చేశారు.

నేడు తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డా.బీఆర్ అంబేడ్కర్ పేరు  పెట్టుకుని ఆ మహానియుణ్ణి నిరంతరం స్మరించుకుంటున్నామన్నారు.

పేదప్రజలు ఆర్థికాభివృద్ధి చెందాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు దళితబంధు, యాదవులు గొర్ల పంపిణీ, ముదిరాజ్, బెస్తలకు చేపల పంపిణీ లాంటి మరెన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారని ఎమ్మెల్యే అన్నారు

నియోజకవర్గంలో 1100 వందల కోట్లతో మల్టీసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,75కోట్లతో బస్ స్టేషన్, కలెక్టరేట్,గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, జిల్లా కేంద్రం ఏర్పాటుతో పాటు మరెన్నో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల ఆశీర్వాదంతో ముందుకుసాగుతున్నామన్నారు.ఇన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ప్రజల భూమి విలువ అదే స్థాయిలో మూడింతలు పెరిగిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

మన బిడ్డల భవిష్యత్ బాగుండాలని ఏడు గురుకులాలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు అండగా ఉన్నామని, పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతి యువకులకు తన స్వంత ఖర్చుతో 110రోజుల పాటు కోచింగ్ తో పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేసి మెటీరియల్  ఇచ్చామన్నారు.

ఎన్నికలప్పుడు కొందరు నాయకులు మొఖాలు చూపిస్తారని,తమ స్వార్థం కోసం కల్లబొల్లి మాటలు చెప్పి మభ్య పెడతారని ప్రజల మోసపోవద్దన్నారు.

కరోనా సమయంలో ఏ ఒక్క నాయకుడు బయటికి రాలేదని తన స్వంత ఖర్చుతో 25000వేల కుటుంబాలకు రేషన్ పంపిణీ చేశామని మునుముందు కేసీఆర్  నాయకత్వంలో,కేటిఆర్  మార్గ నిర్దేశనంలో మరింత గొప్పగా అభివృద్ధి చేసుకుందామన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వస్కుల బాబు,మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, డివిజన్ అధ్యక్షులు గడ్డమీది రాజేష్,హెరాల్డ్, జక్కం ప్రవీణ్,

పోలేపాక సల్మాన్, యూత్ అధ్యక్షుడు వినయ్, 

సప్పిడి ఏసేపు, సాంబయ్య, కయ్యుమ్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ

హన్మకొండ ;

74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హనుమకొండ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవవందనం స్వీకరించారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశభక్తి భావాన్ని నింపుకుని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు. 

ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు సీపీ కలెక్టర్  ప్రశంసాపత్రాలు బహూకరించారు. స్వతంత్ర సమర  యోధులకు  సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, సిపి ఏవి  రంగనాథ్, డిఆర్ఓ  వసూచంద్ర,జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ

హన్మకొండ ;

జిల్లా పోలీసు కార్యాయంలో డెబ్భై నాలుగవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా ప్రజలకు, అధికారులకు, మరియు సిబ్బందికి ఎస్పి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  

అనంతరం ఎస్పి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్రానంతరం దేశంలో సర్వసత్తాక, సార్వభౌమ, లౌకిక రాజ్యంగా రూపుదిద్దుకోవడంలో రాజ్యాంగంది కీలక పాత్ర అని, దేశంలో ఉన్న వివిధ రకాల మతాలు, కులాలు, జాతుల ప్రజలను ఒకే తాటి మీద ఉంచుతూ దేశ సమగ్రతను కాపాడుతున్న రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని ఎస్పి పేర్కొన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల వల్లే అన్ని వర్గాల ప్రజలకూ విద్య, ఉద్యోగ రంగాల్ల్లో సమాన అవకాశాలు లభిస్తున్న విషయం ఆయన గుర్తు చేసారు. జిల్లా పరిధిలో నేర నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ఎస్పి సురేందర్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల పట్ల నేర నియంత్రణకు మరియు రక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ఎస్పి తెలిపారు. సామాన్య ప్రజలతో స్నేహపూర్వకమగా మెలుగుతామని అదే సమయంలో నేరస్తులతో కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు, భూపాలపల్లి డిఎస్పి రాములు, వర్టికల్ డిఎస్పి కిషోర్ కుమార్, జిల్లా పరిధిలోని సిఐలు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, డిపిఓ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

74వగణతంత్ర దినోత్సవ సందర్భంగా రామగుండం ప్రెస్ క్లబ్ లో జాతీయ జెండా ఎగర వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం ప్రెస్ సభ్యులు లక్ష్మీనారాయణ గౌడ్ అంజయ్య యాదవ్ నాగేష్ మధు గంగారపు వెంకటేష్ పాల్గొన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని  రామగుండం కార్పోరేషన్ పరిధిలోని 37వ డివిజన్ లో తిలక్ నగర్ చౌరస్తలో తిలక్ నగర్ డౌన్, ఆటో స్టాండ్, ఎల్బీనగర్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో, ప్రధాన చౌరస్త ఆటో యూనియన్ లో, టాక్సీ స్టాండ్ లో , మరియు వివిధ ప్రాంతాలలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జాతీయ జెండాను అవిష్కరించారు. 

ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే సకల జనులందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. 

ఫెడరల్ స్పూర్తితో పాలిస్తేన్నే దేశం ప్రగతి సాధింస్తుందని కానీ కేంద్ర పాలకులు ఫెడరల్స్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ నిర్వీర్యం చేస్తున్నారని,  రాజ్య‍ాగంలో పోందుపరిచిన చట్టాలను అమలు చెయడం లేదన్నారు.

అనగానిన వర్గాలకు న్యాయం జరగాలంటే చట్టాలు అమలు జరగాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు సాగుతుందని అన్నారు.సిఎం కెసిఆర్  పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని చెప్పారు. దేశానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ ప్రభుత్వం కావాలనీ ప్రజలంతా కోరుతున్నరన్నారు. ప్రజలందరికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.  

ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని స్థానిక 39 డివిజన్ లో గౌతమి ట్రస్ట్ ఆఫీస్ లో ,కాజిపల్లి లో, చైతన్యపురి కాలనీలో గణతంత్ర దినోత్సవం వేడుకలలో పాల్గొని జెండా ఎగరవేసిన బిజెపి నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఈసందర్బంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు ఎందరో త్యాగదనుల కృషి ఫలితం మన రాజ్యాంగం ఈ విధంగా గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం గా ఉంది అని పేర్కొన్నారు ఈకార్యక్రమంలో ట్రస్ట్ ట్రైనర్ శిరీష,బూత్ అధ్యక్షులు బైరం కుమార్,ఎదునూరి మల్లేష్ దండవేనె రాజు,జుమ్మడి రాజకుమార్,ఉమాశంకర్,పెగడపల్లి మల్లేష్,శంకర్, కార్తీక్,సమ్మయ్య,నరసయ్య,

లక్ష్మణ్,రవి,శంకర్,గట్టయ్య,స్వర్ణలత,లక్ష్మి,సాయిలత,తార,శంకరమ్మ,నవలత, బచ్చల రాజేందర్, రవి, సంపత్, కుమార్, మల్లేశం, సారయ్య, రంజాన్, రాములు తదితరులు పాల్గొన్నారు