మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రైల్వే కాంట్రాక్టు వర్కర్స్ సమస్యల గురించి క్యాబిన్ రిపేర్ గ్యారెజ్ రామగుండము రైల్వే స్టేషన్ లో కాంట్రాక్టు వర్కర్స్ తో వారి సమస్యల గురించి మాట్లాడటం జరిగింది,
కాంట్రాక్టు వర్కర్స్ దాదాపు 1000 మంది వరకు ఎన్నో ఏళ్లుగా దీన్నే నమ్ముకుని వర్క్ చేస్తున్నాము. అయితే మాకు ఇంత వరకు pay స్కేల్ కానీ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ Esi కార్డ్స్ కానీ కనీస సౌకర్యాలు లేక కనీసం మమ్మల్ని స్కిల్డ్ వర్కర్స్ గా అయినా గుర్తించ కుండా శ్రమదోపిడికి గురి చేస్తూ మాతో వెట్టి చాకిరీ చేయించు కుంటున్నారు అలాగే మేము చేస్తున్న వర్క్ కి నాలుగు ఐదు నెలలైన సరైన టైం కి జీతాలు ఇవ్వకుండా మేము పని చేసి ఎందుకు అని ఆవేదన వ్యక్తం చేయడంతో రాజ్ ఠాగూర్ కాంట్రాక్టు వర్కర్స్ సమస్యల పట్ల స్పంధిoచి మీకు అండగా నేనుంటా మీ కాoట్రాక్టర్స్ తో నేను మాట్లాడి మీకు సరైన టైం లో అనగా జీవో ప్రకారంగా నెల నెల జీతాలు అందేలా మాట్లాడుతానని హామీ ఇచ్చారు అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులర్ కార్మికులను తగ్గించుకుంటూ కాంట్రాక్టు కార్మికులను రిక్రూట్ చేసుకుని ఈ రకంగా వ్యవహరించడం సహించరాని చర్య కాబట్టి కాంట్రాక్టు కార్మికుల సమస్యల సాధన కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం రాబోయే రోజుల్లో మీకోసం మీ సమస్యల పట్ల నేను పోరాడతాను అనిభరోసా కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రామగుండము నియోజక వర్గ ఇంచార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఈ కార్యక్రమం లో ముఖ్య నాయకులు తాజ్ భాయ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు జగన్ మోహన్ రావు,టౌన్ ప్రెసిడెంట్ ఈదునూరి ప్రసాద్, మైనార్టీ అధ్యక్షులు గౌస్ బాబా, డివిజన్ అధ్యక్షులు సిరిశెట్టి సతీష్, కోఆర్డినేటర్ చాంద్ భాయ్ పల్లి కొండ రాజేష్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: