మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ శివాజీ నగర్ కు చెందిన పెద్దెల్లి సునీత అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్ లోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం చేరింది . పేషంట్ కి. 3 % మాత్రమే బ్లడ్ ఉందని వెంటనే బ్లడ్ ఎక్కించాలని అందుకు ఓ నెగటివ్ రక్తం నాలుగు యూనిట్లు అవసరం ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో వారి బంధువులు సమత ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ ను నాలుగు యూనిట్ల రక్తం సమకూర్చాలని వేడుకున్నారు. నగేష్ వెంటనే స్పందించి తమ సమత ఫౌండేషన్ సభ్యులకు సమాచారమందించి, 4ప్యాకెట్ల ఏ పాజిటివ్ రక్తాన్ని సమకూర్చారు. దీంతో వారి బంధువులు పెద్దెల్లి రామస్వామి సమత ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నగేష్ కు, రక్తదానం చేసిన జాడి మారుతి, ఉయ్యాల వినోద్ కుమార్, రతన్ లకు ధన్యవాదాలు తెలిపారు.
Post A Comment: