ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

హనుమకొండ జిల్లా, కమలాపురం మండలం గూడూరు గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం చేరుకున్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగర పోలీస్ కమిషనర్ కె.రంగనాథ్ తదితరులు  ఘన స్వాగతం పలికారు.

కమలాపురం మండల కేంద్రంలో  43.5 కోట్లతో నిర్మించిన మహాత్మ జ్యోతిరావు పూలే బాలికలు, బారుల విద్యాలయం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలను, కోటి 50 లక్షలతో  జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కోటి 71 లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, 25 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్, 25 లక్షలతో అయ్యప్ప గుడి, 30 లక్షలతో పెద్దమ్మ గుడి, లక్షలతో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్, 30 లక్షలతో మార్కండేయ ఆలయం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో శంకుస్థాపనలు చేసి  రైతు వేదిక ప్రాంగణంలో 69 లక్షల 85 వేల తో నిర్మించిన వివిధ కుల సంఘాల భవనాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం చదువుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యాసంస్కరణలు చేస్తుందని అన్నారు. విద్య వైద్యం రైతు సంక్షేమం తదితర అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలుపరచడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందని రాష్ట్ర పురోగతిని చూసి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వారి రాష్ట్రంలో ఇలాంటి పథకాలు అమలు చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని తారకరామారావు అన్నారు.

అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే బాలబాలికల రెసిడెన్షియల్ విద్యార్థినీ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో ముచ్చటించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుపరచుందని పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను కొనసాగించేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశపెట్టిన విద్య వైద్యం రైతు సంక్షేమం కుల సంఘాల అభివృద్ధి అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన గౌరవం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఛైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ లు, పాడి కౌషిక్ రెడ్డి, ఎమ్మేల్యే లు ఒడితల సతీష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుదీర్ కుమార్, డాక్టర్ తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ప్రజా ప్రతినిధులు స్థానిక సర్పంచ్ ఎంపీపీ జడ్పిటిసి అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: