ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వరంగల్ జర్నలిస్టుల కోసం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం ఎంజీఎం ఎదురుగా ఉన్న ఐ.ఎం.ఏ హాల్లో నిర్వహించారు. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వరంగల్ జర్నలిస్టుల కుటుంబాలకు ప్రత్యేక వైద్య బృందంతో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరం అయిన వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ కంటి వెలుగు శిబిరాన్ని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జర్నలిస్టు కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, ఉపాధ్యక్షుడు యాంసాని శ్రీనివాస్, అల్లం రాజేష్ వర్మ, సహాయ కార్యదర్శులు పెద్దపెల్లి వరప్రసాద్, విష్ణువర్ధన్, బూర్ల నరేందర్, కార్యవర్గ సభ్యులు దొమ్మాటి శ్రీకాంత్, ఎం.డి నయీమ్ పాష, కమటం వేణుగోపాల్, విజయ్ రాజు, డీపీఆర్ఓ బండి పల్లవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటరమణ, ఐ.ఎం.ఏ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్, టీయూడబ్ల్యుజే 143 జిల్లా అధ్యక్షుడు మెండు రవీందర్,  ఐజేయూ(టి.యూ.డబ్ల్యూ.జే) గాడి పెళ్లి మధు, జిల్లా అధ్యక్షుడు రాంచందర్, ప్రధానకార్యదర్శి మట్ట దుర్గప్రసాద్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఆడేపు సాగర్, వరంగల్ తూర్పు జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మెరుగు రాజేంద్ర ప్రసాద్, తూర్పు సీనియర్ జర్నలిస్టులు సంగోజి రవి, బండి రవి, పూర్ణ, వాయిద్ గుల్షన్, ఎస్ఎం సయ్యద్, జున్ను స్వామి , శ్యామ్ , వెంకన్న, చిన్న బాబు, సదాశివుడు, నరేష్, వనం భాస్కర్, ఆడెపు మహేష్, హరి, రాజేష్, సంతోష్, పాపాని భాస్కర్, అమీర్, పుప్పాల అనిల్, నితీష్, శ్యామ్, నాగపురి నాగరాజు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: