ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని, క్రీడల్లో పాల్గొనడం ముఖ్యమని, ఆటల్లో ఓటములు సహజమని, ఓటమి నుంచి విజయం వరించే వరకు శ్రమిoచాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం అంబేద్కర్ స్టేడియంలోని సింగరేణి మినీ ఫంక్షన్ హాల్ లో భూపాలపల్లి బ్యాడ్మింటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఓపెన్ షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలను ఎస్పీ ప్రారంభించారు. ఆ తర్వాత క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు వారితో కలిసి షటిల్ అడారు. ఈ క్రీడల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 80 టీమ్ పాల్గొంటున్నాయి. రెండు రోజుల పాటు ఈ ఆటలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఎస్పి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడతాయని, క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. యువత క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని క్రీడలతో మానసికంగా దృఢంగా తయారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సిఐ రాజిరెడ్డి, డాక్టర్లు కె.ఎస్ కిరణ్, కే శ్రీనివాస్, ప్రధాన్ భరత్ రెడ్డి భూపాలపల్లి ఎస్సై ప్రశాంత్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.
Post A Comment: