ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

వరంగల్ లోని హెల్త్ సిటీ నిర్మాణ పనులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శనివారం పరిశీలించారు. అనంతరం 

మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్ సిటీ నిర్మాణం పరిశీలించాము. 

వరంగల్ తో పాటు, ఉత్తర తెలంగాణ ప్రజల కోసం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్  2000 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టారు.

నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి.

2023 చివరి నాటికి భవనం పూర్తి అవుతుంది అన్నారు. దసరా నాటికే పూర్తి అయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి, ఏజెన్సీ, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించాము. 

రాత్రి పగలు కష్టపడాలి అని ఆదేశాలు ఇచ్చాం. మొత్తం 16 న్నర లక్షల ఎస్ ఎఫ్ టి లో  24 అంతస్తుల నిర్మాణం జరుగుతున్నది.

వరంగల్ హెల్త్ సిటీ చారిత్రాత్మక భవనం

రాష్ట్రానికే కాదు దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు ఇక్కడ అందబోతున్నాయి.

216ఎకరాల్లో ఈహెల్త్ సిటీ రూపుదిద్దుకుంటోంది.

అవయవమార్పిడి ఆపరేషన్లు కూడా వరంగల్ లో అందుబాటులోకి రాబోతాయి.హైదరాబాద్ తర్వాత వరంగల్ ను అంతగా అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారు.

రాజకీయాల కోసం కొందరు విమర్శలు చేస్తారు.

గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా విమర్శలు చేశారు.విమర్శలు చేసినోళ్లే ఇవాళ నోరెళ్లబెడుతున్నాయి.

కాంగ్రెస్ హయాంలో నేను రానుబిడ్డో సర్కారు దవాఖనకు అనే వారు. ఇప్పుడు నేను పోత బిడ్డో సర్కార్ దవాఖనకు అంటుతున్నారు.

ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. పీజీ సీట్లలో రెండో స్థానంలో ఉంది.

మెడికల్ చదువు కోసం మన పిల్లలు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కృషి చేస్తున్నాం.

సమైక్య రాష్ట్రంలో మెడికల్ విద్యలో వెనకబడ్డాం.

తెలంగాణలో మంచి పథకాలు అమలు చేస్తున్నారని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు చెబుతున్నారు.

ఢిల్లీలో, పంజాబ్ లో కంటి వెలుగు ప్రారంభిస్తామని ప్రకటించారు.

కంటి వెలుగుకు బారీ స్పందన వస్తోంది.ప్రభుత్వ ఆసుపత్రుల వద్దకు ప్రజలు కాదు, ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లి పరీక్షలు చేస్తున్నది. కేంద్రం ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోంది.

కాళేశ్వరం స్ఫూర్తితో వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తాం.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు కూడా ఇలాగే అన్నారు. అవుతుందా అని. నీళ్ళు వచ్చి వరంగల్ లో రెండు పంటలు పండుతున్నాయి.

యాసంగిలో రెండు పంటలు పండుతున్నాయి అంటే కాళేశ్వరం కారణం.

వరంగల్ నగరానికే కాదు జాతీయ స్థాయిలో అద్భుతమైన అవసరాలు తీర్చే ఆసుపత్రి.

దేశానికే ఒక మోడల్ కానున్నది.పేద ప్రజలకు కార్పొరేట్ వసతులు కలుగుతాయి.

వరంగల్ లో హెల్త్ యూనివర్సటీ, వెటర్నిటీ యునివర్సటీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆలోచించారు. మూడు షిఫ్టుల్లో పనులు చేసి, నాణ్యత ప్రమాణాలు పూర్తి స్థాయిలో పాటించి యుద్ద ప్రాతిపదికన భవనం పూర్తి చేయాలి. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం. 

926 మంది డాక్టర్లు నియామకం చేశాం.

12,13 వందల ప్రొఫెసర్ పోస్టుల రిక్రూట్ చేస్తున్నాం.

కేంద్రం సహకారం ఇవ్వడం లేదు. వివక్ష పూరిత వైఖరితో 157 కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి  ఇవ్వలేదు. రాష్ట్ర సొంత నిధులతో సీఎం  8 మెడికల్ కాలేజీలు కట్టారు. జిల్లాకు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు.

సీఎం  స్వయంగా హెల్త్ సిటీ పనులు సమీక్ష చేస్తున్నారు. ఎలాంటి నిధుల కొరత లేదు. 

వినయ్ భాస్కర్ మాట్లాడుతూ 

వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాలు కడుతుంటే విమర్శిస్తున్నారు.

పేద వాళ్లు పెద్ద భవనాల్లో చదువుకోవద్దా...? పెద్ద భవనాల్లో చదువుకోవద్దా..?

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: