ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

జిల్లాలో టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ పూర్తి ఆన్ లైన్ లో నిర్వహించాలని, ఇందు కోసం జిల్లాలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని  కలెక్టర్ లకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన,  రాష్ట్ర విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి తో కలిసి టీచర్ల బదిలీ పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు మనబడి మోడల్ పాఠశాలలు అంశాల పై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, అవినితికి తావు లేకుండా ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ లో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీలు లేదని, ప్రభుత్వ మార్గదర్శకాల పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు సినియార్టి జాబితా, ఖాళీల జాబితా ఆన్ లైన్ లో ప్రదర్శించాలని, వాటిలో అభ్యంతరాలను ఉపాధ్యాయుల నుంచి స్వీకరించాలని తెలిపారు.

జిల్లాలో ఉపాధ్యాయులు కోసం తాత్కాలికంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.  మన ఊరు మన బడి కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడంలో కలెక్టర్ లు కీలక పాత్ర పోషించారని, మోడల్ పాఠశాలలను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా కలెక్టర్ లు తమ జిల్లా పరిధిలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు పనులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. 

రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి  ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరిగేలా కలెక్టర్ లు పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్దం చేయాలని, 2 రోజుల్లో జిల్లాలకు ఫర్నీచర్ వస్తాయని, సదరు ఫర్నీచర్ ను ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న పాఠశాలలకు తరలించాలని సూచించారు.

మన ఊరు మనబడి కింద అన్ని రకాల పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రారంభోత్సవం నిర్వహించాలని, ఏ చిన్న పోరపాటు జరిగినా  అనవసరపు అపనిందలు పడాల్సి వస్తుందని, అధికారులు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

హనుమకొండ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ  జిల్లాలో మొత్తం 14 మండలాలలో 28 స్కూల్స్ ను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎంపిక చేసిన 22 మోడల్ మన ఊరు- మన బడి పాఠశాలలో 14 పాఠశాల పనులు సంపూర్ణంగా పూర్తి చేసామని, 8 పాఠశాలలో పెయింటింగ్ వర్క్ పెండింగ్లో ఉందని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. పూర్తిస్థాయిలో పనులు ఫిబ్రవరి 10 నాటికి పూర్తవుతాయని, మిగిలిన పాఠశాలలో నరేగా పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. 

జిల్లాలో టీచర్ల బదిలీలు పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితాను సమర్పించామని, ఖాళీల జాబితా మరో గంట సమయంలో సమర్పిస్తామని  కలెక్టర్ తెలిపారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో , జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై, తదితర విద్యాశాఖ అధికారులు  పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: