ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనం స్మశానవాటికల లో నాసిరకం పనులు మారుమూల గ్రామం కావడంతో పట్టించుకోని అధికారులు మహాదేవపూర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమల మండలం లెంకలగడ్డ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన గ్రామం పల్లె ప్రకృతి స్మశాన వాటికలో తూతూ మంత్రంగా పనులు నిర్వహించి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని తమ ఇష్టానుసారంగా పనులు నిర్వహించి కాంట్రాక్టర్ లు సొమ్ములు జమ చేసుకున్నారని ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి ఊరు ఊర రైతు లకు సంబందించిన ఎరువుల తయారీ షెడ్డు ను ఒక పటిష్టమైన పద్ధతి లో నిర్మించే కార్యక్రమంచేసి నిధులు విడుదల చేస్తే ఇలా నాసిరకం పనులు చేసి ప్రజాధనంము ను వృధా చేస్తున్నారు. అలాగే హరిత హారం లో భాగంగా చెట్టులు పెంచే కార్యక్రమం చేస్తే మా ఊరులో ఇలా నాశనం చేస్తున్నారు...!
ఇలా వుంది మా పరిస్థితి ఈ మారుమూల ప్రాంతం లో అడిగే వారు వుండరు అని మాకు నచ్చినట్టు మేము కడుతాము మమ్మల్ని అడిగే వారు
లేరు నాకు వచ్చింది కాంట్రాక్టు నాకు నచ్చి నట్టు కడుతా అనే రీతిలో వున్నట్టు వుంది. మార్మూల గ్రామం కావడంతో అధికారి పట్టించుకోవడం లేదని అధికారులకు అడపాదడప మామూలు అందిస్తున్నారని ప్రజలలో గుసగుసలు వినబడుతున్నాయి హరితహారం కింద చెట్లను పెంచాల్సిన చెట్లను పెంచకుండా తమ ఇష్టానుసారంగా పడవేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని షెడ్డు పని చేసే కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి ఇలా గ్రామంలో జరిగే అనేక అభివృద్ధి పనులపై నాసిరకం పనులు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అని స్థానిక బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు నిరంజన్ మరియు ప్రజలు పత్రిక ముఖంగా అధికారులను కోరుకుంటూన్నారు.
Post A Comment: