మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
లైబ్రరీ చైర్మన్ కు భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ పుస్తకం బహుకరణ
ప్రతి లైబ్రరీలో భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ పుస్తకాలను ఉంచేలా చూడాలని
పెద్దపల్లి జిల్లా లైబ్రరీ చైర్మన్ రఘువీర్ సింగ్ ని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన లైబ్రరీ చైర్మన్ రఘువీర్ సింగ్ కి భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ పుస్తకాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా మార్షల్ నగేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్నింటి కన్నా ఉన్నతమైందని, దీని రూప కల్పనలో ముఖ్యపాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహానుభావుడు చిరస్మరణీయులన్నారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 నుండి 51 వరకు గల ఆర్టికల్స్ ను విశేషణాత్మకంగా వివరిస్తూ సులువుగా ఆర్డమయ్యే విధంగా భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ పుస్తకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. జిల్లాల్లో అన్నీ లైబ్రరీ కేంద్రాల్లో భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ పుస్తకాలను అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. వెంటనే రఘువీర్ స్పందించి తప్పకుండా ఉంచుతామని తెలిపారు. ఇంకా ఆయన వెంట ఎస్సీ ఎస్టీ వర్కింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కట్కూరి మల్లేష్ తదితరులు ఉన్నారు.
Post A Comment: