మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గత 50సంవత్సరాల క్రితం ప్రారంభించబడి ఎందరో విద్యార్థినీ విద్యార్థులను తీర్చిదిద్దిన శ్రీ సరస్వతీ శిశుమందిర్, జవహర్ నగర్ పాఠశాల ఇంగ్లీషు మీడియంతో తేది 26-1-2023 గురువారం మాఘ శుద్ధ పంచమి శ్రీ సరస్వతీ మాత జన్మదినం రోజున తిరిగి పునఃప్రారంభించడం జరిగినది.
ఈ సందర్భంగా జరిగిన అక్షరాభ్యాస కార్యక్రమంలో పట్టణంలోని చిన్నారులు తమ తల్లిదండ్రులతో వచ్చి అక్షరాభ్యాసం చేసుకొన్నారు.
పాఠశాల ప్రబంధకారిణి అధ్యక్షులు సొమారపు లావణ్య అరుణ్ కుమార్అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా లావణ్య పతాకావిష్కరణ చేశారు. గణపతి పూజ, సరస్వతీ హోమం అనంతరం అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నూతనంగా తీర్చిదిద్దిన క్లాస్ రూములను లావణ్య, శారదానగర్ పాఠశాల అధ్యక్షులు బంక రామస్వామి, విద్యాపీఠం జిల్లా కార్యదర్శి కొత్తకాపు సుధాకర్ రెడ్డి, సోమారపు అరుణ్ కుమార్ లు ప్రారంభం చేశారు.
ఈ సందర్బంగా అధ్యక్షులు లావణ్య మాట్లాడుతూ పిల్లలకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థుల సర్వాంగీణ వికాసం కోసం పాటుపడతామని, అందరి సహాయ సహకారాలతో పాఠశాలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని పెద్దలు, దాతలు సహకరించాలని కోరారు. ఈ వసంత పంచమి నుండే మూడు నెలల కాలం పాటు ప్లే వే మెథడ్ లో పిల్లలకు విద్యనందిస్తామని తల్లిదండ్రులు అడ్మిషన్లు చేసుకోవాలని కోరారు. రానున్న విద్యాసంవత్సరానికి ఇది ఆరంభమని అన్నారు. పాఠశాల ప్రప్రథమ ప్రధానాచార్యులు అడ్వకేట్ గంట నారాయణ మాట్లాడుతూ ఎప్పుడూ తన సహాయ సహకారాలుంటాయని, లక్షలాది రూపాయల విలువచేసే తన గ్రంథాలయాన్ని పాఠశాలకు అందిస్తానన్నారు. కొత్తకాపు సుధాకర్ రెడ్డి, బంక రామస్వామి, సోమారపు అరుణ్ కుమార్, ఇసంపెల్లి వెంకన్న, విజయగిరి వెంకటేశ్వర్లు చిన్నారులకు శుభాశిస్సులు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డా. క్యాస శ్రీనివాస్, కార్యదర్శి గంధం రవీందర్, కోశాధికారి నలుమాసు సత్తయ్య, విద్యాపీఠం విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ పూదరి సత్యనారాయణ, గోటికార్ శ్రీనివాస్, సభ్యులు రాచమల్ల జనార్దన్, సంజీవ్, పొన్నం విజయకుమార్, రాములు గౌడ్, బండ సమ్మన్న, శివాజీ, లక్ష్మినర్సయ్య తదితరులతో పాటు దాతలు, హితైశులు, మాతలు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలొ పాల్గొన్నారు.
Post A Comment: