మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మహాత్మా గాంధీజీ అమరత్వం జనవరి 30 వర్ధంతి సందర్భంగా రామగుండం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పుట్ట రాజన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జైహో హిందూ-ముస్లిం ఐక్యత కోసం "జై భారత్ "ఆధ్వర్యంలో దేశ స్వతంత్ర పోరాట వీరులను స్మరించుకుంటూ నవభారత నిర్మాణం కొరకు,రండి కదలిరండి అని పిలుపునిచ్చారు. అషాప్ ఖ్ బిస్మిల్, ఉద్ధమ్ సింగ్, వివేకానంద నేతాజీ గాంధీజీ గఫార్ ఖాన్ లాంటి మహనీయులు చూపిన బాటలో నడుద్దాం మతోన్మాదాన్ని నిర్మూలిద్దాం, నవీన భారత్ ను నిర్మిద్దాం అంటూ జై భారత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ నుండి,జనవరి లాస్ట్ వరకు, ప్రతి సంవత్సరం "జై భారత్ "ఆధ్వర్యంలో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నామని,ఇందులో భాగంగా, హిందూ_ ముస్లిం సమైక్యత సభ పెద్దపల్లి జిల్లా, రామగుండం ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి వివిధ సంఘాలు,యూనియన్లు,రాజకీయ నాయకులు,ప్రెస్ మిత్రులు వక్తలుగా పాల్గొని మాట్లాడారు,జై భారత్ వ్యవస్థాపకులు రమణమూర్తి,ఆధ్వర్యంలో ,విజయ విహారం పత్రిక ,ద్వారా దేశంలో మతసామరస్యం కోసం జై భారత్ సంస్థ అలుపెరుగని కృషి చేస్తుందని పేర్కొన్నారు,ముందుగా పర్యావరణ,పరిరక్షణ గూర్చి చర్చించారు,ఈ కార్యక్రమంలో షేక్ జమీల్ హుస్సేన్ ,కొండ్ర అంజయ్య, పరకాల లక్ష్మణ్, గంగారపు వెంకటేష్ ,కండె రవీందర్, సతీష్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: