ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

18వ డివిజన్ చెన్నారెడ్డి కాలనిలో ఏర్పాటు చేసిన భారతరత్న డా.బిఆర్ అంబెడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కొరబోయిన విజయ్ కు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.  

డప్పు చప్పులతో, డిజెలతో మహిళలు, యువకులు  నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు

అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు స్థలికి చేరుకున్న ఎమ్మెల్యేకు మహిళలు పూలు చల్లి సాదరంగా ఆహ్వానం తెలిపారు.

తదనంతరం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్  జై భీమ్ నినాదాల మధ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ

అంబెడ్కర్  కలలు కన్న సమానత్వం, సామాజిక న్యాయాన్ని పేదప్రజల అభివృద్దే ధ్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

ఆనాడు  అంబేడ్కర్  రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్లనే మనం  కేసిఆర్  ఆధ్వర్యంలో తెలంగాణ నూతన రాష్ట్రాన్ని ఏర్పరుచుకున్నమని గుర్తు చేశారు.

నేడు తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డా.బీఆర్ అంబేడ్కర్ పేరు  పెట్టుకుని ఆ మహానియుణ్ణి నిరంతరం స్మరించుకుంటున్నామన్నారు.

పేదప్రజలు ఆర్థికాభివృద్ధి చెందాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు దళితబంధు, యాదవులు గొర్ల పంపిణీ, ముదిరాజ్, బెస్తలకు చేపల పంపిణీ లాంటి మరెన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారని ఎమ్మెల్యే అన్నారు

నియోజకవర్గంలో 1100 వందల కోట్లతో మల్టీసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,75కోట్లతో బస్ స్టేషన్, కలెక్టరేట్,గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, జిల్లా కేంద్రం ఏర్పాటుతో పాటు మరెన్నో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల ఆశీర్వాదంతో ముందుకుసాగుతున్నామన్నారు.ఇన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ప్రజల భూమి విలువ అదే స్థాయిలో మూడింతలు పెరిగిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

మన బిడ్డల భవిష్యత్ బాగుండాలని ఏడు గురుకులాలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు అండగా ఉన్నామని, పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతి యువకులకు తన స్వంత ఖర్చుతో 110రోజుల పాటు కోచింగ్ తో పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేసి మెటీరియల్  ఇచ్చామన్నారు.

ఎన్నికలప్పుడు కొందరు నాయకులు మొఖాలు చూపిస్తారని,తమ స్వార్థం కోసం కల్లబొల్లి మాటలు చెప్పి మభ్య పెడతారని ప్రజల మోసపోవద్దన్నారు.

కరోనా సమయంలో ఏ ఒక్క నాయకుడు బయటికి రాలేదని తన స్వంత ఖర్చుతో 25000వేల కుటుంబాలకు రేషన్ పంపిణీ చేశామని మునుముందు కేసీఆర్  నాయకత్వంలో,కేటిఆర్  మార్గ నిర్దేశనంలో మరింత గొప్పగా అభివృద్ధి చేసుకుందామన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వస్కుల బాబు,మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, డివిజన్ అధ్యక్షులు గడ్డమీది రాజేష్,హెరాల్డ్, జక్కం ప్రవీణ్,

పోలేపాక సల్మాన్, యూత్ అధ్యక్షుడు వినయ్, 

సప్పిడి ఏసేపు, సాంబయ్య, కయ్యుమ్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: