ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మెట్టు దర్వాజ ప్రాంతంలో ఖిలా వరంగల్ డప్పు కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ
రాజ్యాంగ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు మనమంతా కృషి చేయాలన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి అజరామరమని ఎమ్మెల్యే కొనియాడారు. అటువంటి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన యావత్ భారతదేశానికే ఒక రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పోశాల పద్మ స్వామి, బైరబోయిన ఉమాదామోదర్, ఖిలా వరంగల్ డప్పు కళాకారులు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: