ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లా పోలీసు కార్యాయంలో డెబ్భై నాలుగవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా ప్రజలకు, అధికారులకు, మరియు సిబ్బందికి ఎస్పి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం ఎస్పి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్రానంతరం దేశంలో సర్వసత్తాక, సార్వభౌమ, లౌకిక రాజ్యంగా రూపుదిద్దుకోవడంలో రాజ్యాంగంది కీలక పాత్ర అని, దేశంలో ఉన్న వివిధ రకాల మతాలు, కులాలు, జాతుల ప్రజలను ఒకే తాటి మీద ఉంచుతూ దేశ సమగ్రతను కాపాడుతున్న రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని ఎస్పి పేర్కొన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల వల్లే అన్ని వర్గాల ప్రజలకూ విద్య, ఉద్యోగ రంగాల్ల్లో సమాన అవకాశాలు లభిస్తున్న విషయం ఆయన గుర్తు చేసారు. జిల్లా పరిధిలో నేర నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ఎస్పి సురేందర్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల పట్ల నేర నియంత్రణకు మరియు రక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ఎస్పి తెలిపారు. సామాన్య ప్రజలతో స్నేహపూర్వకమగా మెలుగుతామని అదే సమయంలో నేరస్తులతో కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు, భూపాలపల్లి డిఎస్పి రాములు, వర్టికల్ డిఎస్పి కిషోర్ కుమార్, జిల్లా పరిధిలోని సిఐలు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, డిపిఓ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: