మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం కార్పోరేషన్ పరిధిలోని 37వ డివిజన్ లో తిలక్ నగర్ చౌరస్తలో తిలక్ నగర్ డౌన్, ఆటో స్టాండ్, ఎల్బీనగర్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో, ప్రధాన చౌరస్త ఆటో యూనియన్ లో, టాక్సీ స్టాండ్ లో , మరియు వివిధ ప్రాంతాలలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జాతీయ జెండాను అవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే సకల జనులందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.
ఫెడరల్ స్పూర్తితో పాలిస్తేన్నే దేశం ప్రగతి సాధింస్తుందని కానీ కేంద్ర పాలకులు ఫెడరల్స్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ నిర్వీర్యం చేస్తున్నారని, రాజ్యాగంలో పోందుపరిచిన చట్టాలను అమలు చెయడం లేదన్నారు.
అనగానిన వర్గాలకు న్యాయం జరగాలంటే చట్టాలు అమలు జరగాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు సాగుతుందని అన్నారు.సిఎం కెసిఆర్ పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని చెప్పారు. దేశానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ ప్రభుత్వం కావాలనీ ప్రజలంతా కోరుతున్నరన్నారు. ప్రజలందరికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: